Share News

ఏ మున్సిపాలిటీలో.. ఏ పార్టీ గెలిచిందంటే..

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:00 PM

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించిందంటే..

ఏ మున్సిపాలిటీలో.. ఏ పార్టీ గెలిచిందంటే..

హైదరాబాద్, ఫిబ్రవరి13: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం సాయంత్రం ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్‌.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య నెలకొందని పలితాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా మున్సిపాలిటీల్లో ఏ పార్టీ ఘన విజయం సాధించిందంటే..


1. ఉమ్మడి నల్లగొండ జిల్లా: ఈ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డులను గెలుచుకొంది. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో తమ సత్తా చాటారు. దీంతో ఆ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడింది.

  • ఆలేరు ( వార్డుల సంఖ్య:12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3, బీజేపీ 2, ఇతరులు 0)

  • భువనగిరి ( వార్డుల సంఖ్య: 35) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు 5)

  • చౌటుప్పల్‌ ( వార్డుల సంఖ్య: 20) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు 1)

  • మోత్కూరు ( వార్డుల సంఖ్య:12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 1)

  • పోచంపల్లి ( వార్డుల సంఖ్య:13) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 1)

  • యాదగిరిగుట్ట ( వార్డుల సంఖ్య:12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 1, బీజేపీ 2, ఇతరులు 1)

  • హుజూర్‌నగర్‌ ( వార్డుల సంఖ్య: 28) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 4, బీజేపీ 0, ఇతరులు 5)

  • కోదాడ ( వార్డుల సంఖ్య: 35) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 6) .

  • నేరేడుచర్ల ( వార్డుల సంఖ్య: 15): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, బీజేపీ 0, ఇతరులు 1) .

  • సూర్యాపేట (వార్డుల సంఖ్య: 48) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 3) .

  • తిరుమలగిరి (వార్డుల సంఖ్య: 15) : బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 10, బీజేపీ 0, ఇతరులు 0) .

  • చండూర్‌ ( వార్డుల సంఖ్య: 10) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 1).

  • చిట్యాల ( వార్డుల సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 2, బీజేపీ 0, ఇతరులు 1).

  • దేవరకొండ ( వార్డుల సంఖ్య: 20) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2).

  • హాలియా (వార్డుల సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1, బీజేపీ 0, ఇతరులు 0).

  • మిర్యాలగూడ ( వార్డుల సంఖ్య: 48): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 31, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 2).

  • నందికొండ (వార్డుల సంఖ్య: 12): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1, బీజేపీ 0, ఇతరులు 0).


2. ఉమ్మడి మెదక్‌ జిల్లా: బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా కంచుకోట. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ.. అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. పలు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటింది. జిల్లాలో 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది.

  • చేర్యాల ( వార్డులు సంఖ్య: 12 ): బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 7, బీజేపీ 0, ఇతరులు 0).

  • దుబ్బాక ( వార్డులు సంఖ్య: 20) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 11, బీజేపీ 2, ఇతరులు 3).

  • గజ్వేల్‌ ( వార్డులు సంఖ్య: 20) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 1).

  • హుస్నాబాద్‌ ( వార్డులు సంఖ్య: 20): కాంగ్రెస్. ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 4, బీజేపీ 0, ఇతరులు 0).

  • అందోలు - జోగిపేట ( వార్డులు సంఖ్య: 20) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 1).

  • గడ్డపోతారం ( వార్డులు సంఖ్య: 18) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 14, బీజేపీ 0, ఇతరులు 1).

  • గుమ్మడిదల ( వార్డులు సంఖ్య: 22) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఇతరులు 1).

  • ఇంద్రేశం (వార్డులు సంఖ్య: 18) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 9, బీజేపీ 2, ఇతరులు 1).

  • ఇస్నాపూర్‌ ( వార్డులు సంఖ్య: 26) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 0, ఇతరులు 4).

  • జిన్నారం ( వార్డులు సంఖ్య: 20) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 8, బీజేపీ 4, ఇతరులు 2).

  • కోహిర్‌ (వార్డులు సంఖ్య: 16) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2).

  • నారాయణ్‌ఖేడ్‌ (వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు 0)

  • సదాశివపేట్‌ ( వార్డులు సంఖ్య: 26) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 7, బీజేపీ 1, ఇతరులు 1).

  • సంగారెడ్డి ( వార్డులు సంఖ్య: 38) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, ఇతరులు 4).

  • జహీరాబాద్‌ ( వార్డులు సంఖ్య: 37) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 3, ఇతరులు 5)

  • మెదక్‌ ( వార్డులు సంఖ్య: 32) : బీఆర్ఎస్. ( కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 15, బీజేపీ 2, ఇతరులు 1)

  • నర్సాపూర్‌ ( వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4, ఇతరులు 0).

  • రామాయంపేట ( వార్డులు సంఖ్య:12) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు 0)

  • తూప్రాన్‌ ( వార్డులు సంఖ్య: 16) : కాంగ్రెస్. ( కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 9, బీజేపీ 3, ఇతరులు 0).


3. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. కానీ నారాయణపేట మున్సిపాలిటీ మాత్రం బీజేపీ ఖాతాలో పడింది. ఇక అలంపూర్, అమరచింత మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.

  • భూత్పూర్‌ ( వార్డులు సంఖ్య: 10) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 1, బీజేపీ 2, ఇతరులు 0).

  • దేవరకద్ర ( వార్డులు సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 4, బీజేపీ1, ఇతరులు 1).

  • కోస్గి ( వార్డులు సంఖ్య: 16) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 0, బీజేపీ 0, ఇతరులు 0).

  • మద్దూరు ( వార్డులు సంఖ్య: 16) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 6, బీజేపీ 0, ఇతరులు 1).

  • మక్తల్‌ ( వార్డులు సంఖ్య: 15/16) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 0, బీజేపీ 3, ఇతరులు 0).

  • నారాయణపేట ( వార్డులు సంఖ్య: 24): బీజేపీ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, బీజేపీ 11, ఇతరులు 4)

  • అలంపూర్‌ ( వార్డులు సంఖ్య: 10): హంగ్ (కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5 గెలుచుకుంది).

  • గద్వాల్‌ ( వార్డులు సంఖ్య: 37) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇతరులు 3).

  • అయిజ ( వార్డులు సంఖ్య: 20): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 13, బీజేపీ 0, ఇతరులు 0).

  • వడ్డేపల్లి ( వార్డులు సంఖ్య: 10): స్వతంత్రులు.. 8 వార్డుల్లో గెలుపొందారు. కాంగ్రెస్ (1), బీఆర్ఎస్ (1) గెలుపొందింది.

  • అమరచింత ( వార్డులు సంఖ్య: 10) : హంగ్ (కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు 1)

  • ఆత్మకూరు ( వార్డులు సంఖ్య: 10) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 1, బీజేపీ 3, ఇతరులు 0).

  • కొత్తకోట ( వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు 1).

  • పెబ్బేరు ( వార్డులు సంఖ్య:12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 5, బీజేపీ 0, ఇతరులు 0).

  • వనపర్తి ( వార్డులు సంఖ్య: 33) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 20, బీఆర్ఎస్ 8, బీజేపీ 2, ఇతరులు 3).

  • కల్వకుర్తి ( వార్డులు సంఖ్య: 22) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1).

  • కొల్లాపూర్‌ ( వార్డులు సంఖ్య: 19) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 0).

  • నాగర్‌కర్నూలు ( వార్డులు సంఖ్య: 24): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 6, బీజేపీ 0, ఇతరులు 0).

  • షాద్‌నగర్‌ ( వార్డులు సంఖ్య: 28) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు 5).

  • కొడంగల్‌ ( వార్డులు సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, బీజేపీ 0, ఇతరులు 1).

  • ఆమనగల్‌ ( వార్డులు సంఖ్య: 15) : బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 8, బీజేపీ 6, ఇతరులు 0).


4. ఉమ్మడి వరంగల్‌ జిల్లా: ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను తన ఖాతాల్లో వేసుకుంది. కేవలం రెండు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసింది. కేసముద్రంలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి సమానంగా అభ్యర్థులు విజయం సాధించారు.

  • జనగామ ( వార్డులు సంఖ్య: 30): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 13, బీజేపీ 0, ఇతరులు 5).

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ ( వార్డులు సంఖ్య: 18): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 0, ఇతరులు 0).

  • నర్సంపేట ( వార్డులు సంఖ్య: 30) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 21, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2).

  • వర్ధన్నపేట ( వార్డులు సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 6, బీజేపీ 0, ఇతరులు 1).

  • పరకాల ( వార్డులు సంఖ్య: 22) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 6, బీజేపీ 3, ఇతరులు 0).

  • డోర్నకల్‌ ( వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 0, ఇతరులు 0).

  • కేసముద్రం ( వార్డులు సంఖ్య: 16) : హంగ్ (కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8).

  • మహబూబాబాద్‌ ( వార్డులు సంఖ్య: 36): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 11).

  • మరిపెడ ( వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 5, బీజేపీ 0, ఇతరులు 1).

  • తొర్రూర్‌ ( వార్డులు సంఖ్య: 16): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, బీజేపీ 0, ఇతరులు 0).

  • భూపాలపల్లి ( వార్డులు సంఖ్య: 30) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 10, బీజేపీ 2, ఇతరులు 2).

  • ములుగు ( వార్డులు సంఖ్య: 20): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 2)


5. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా: ఈ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పరమయ్యాయి. మిగిలిన అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

  • చొప్పదండి ( వార్డులు సంఖ్య: 14) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, బీజేపీ 3, ఇతరులు 0).

  • హుజూరాబాద్‌ ( వార్డులు సంఖ్య: 30) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 1).

  • జమ్మికుంట ( వార్డులు సంఖ్య: 30): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇతరులు 4).

  • ధర్మపురి ( వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, బీజేపీ 0, ఇతరులు 0).

  • జగిత్యాల ( వార్డులు సంఖ్య: 50): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఇతరులు 17).

  • కోరుట్ల ( వార్డులు సంఖ్య: 33) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 8, బీజేపీ 6, ఇతరులు 1).

  • మెట్‌పల్లి ( వార్డులు సంఖ్య: 26) : బీజేపీ ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 6, బీజేపీ 10, ఇతరులు 4).

  • రాయికల్‌ ( వార్డులు సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1).

  • సిరిసిల్ల ( వార్డులు సంఖ్య:39): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 27, బీజేపీ 5, ఇతరులు 1).

  • వేములవాడ ( వార్డులు సంఖ్య: 28): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 2).

  • మంథని ( వార్డులు సంఖ్య: 13) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 1, బీజేపీ 0, ఇతరులు 1).

  • పెద్దపల్లి ( వార్డులు సంఖ్య: 36) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు 7).

  • సుల్తానాబాద్‌ ( వార్డులు సంఖ్య: 15) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు 1).


6. ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఈ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. బీఆర్ఎస్ ఒక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోలేదు.

  • ఏదులాపురం ( వార్డులు సంఖ్య: 32) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, బీజేపీ 0, ఇతరులు 6).

  • కల్లూరు ( వార్డులు సంఖ్య: 20) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 7, బీజేపీ 0, ఇతరులు 1).

  • మధిర ( వార్డులు సంఖ్య: 22) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 18, బీఆర్ఎస్ 1, బీజేపీ 0, ఇతరులు 3).

  • సత్తుపల్లి ( వార్డులు సంఖ్య: 23) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 6, బీజేపీ 0, ఇతరులు 0).

  • వైరా ( వార్డులు సంఖ్య: 20) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 5, బీజేపీ 0, ఇతరులు 3).

  • అశ్వారావుపేట ( వార్డులు సంఖ్య: 22) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 2, బీజేపీ 1, ఇతరులు 2).

  • ఇల్లెందు ( వార్డులు సంఖ్య: 24) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 3, బీజేపీ 0, ఇతరులు 2).


7. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా: ఈ జిల్లాలో ఆదిలాబాద్‌లో 21 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇక కాగజ్ నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు సమానంగా గెలిచారు. దీంతో హంగ్ ఏర్పడినట్లు అయింది.

  • ఆదిలాబాద్‌ ( వార్డులు సంఖ్య: 49): బీజేపీ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 21, ఇతరులు 11).

  • భైంసా ( వార్డులు సంఖ్య: 26): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 2, బీజేపీ 13, ఇతరులు 3).

  • ఖానాపూర్‌ ( వార్డులు సంఖ్య: 12): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు 1).

  • నిర్మల్‌ ( వార్డులు సంఖ్య: 42): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, బీజేపీ 13, ఇతరులు 3).

  • ఆసిఫాబాద్‌ ( వార్డులు సంఖ్య: 20): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 9, బీజేపీ 0, ఇతరులు 4).

  • కాగజ్‌ నగర్‌ ( వార్డులు సంఖ్య: 30): బీఆర్ఎస్ (కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 11, బీజేపీ 5, ఇతరులు 5).

  • బెల్లంపల్లి ( వార్డులు సంఖ్య: 34) : హంగ్.. (కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీఆర్ఎస్ 1, బీజేపీ 5, ).

  • చెన్నూరు ( వార్డులు సంఖ్య: 18): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఇతరులు 1).

  • క్యాతనపల్లి ( వార్డులు సంఖ్య: 22): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 10, బీజేపీ 0, ఇతరులు 5).

  • లక్షెట్టిపేట ( వార్డులు సంఖ్య: 15): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు 0).


8. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: ఈ జిల్లాలో మూడు మునిసిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ వశం కాగా.. మిగిలిన మునిసిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.

  • చేవెళ్ల ( వార్డులు సంఖ్య: 18): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 3, ఇతరులు 0).

  • ఇబ్రహీంపట్నం ( వార్డులు సంఖ్య: 24): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 13, బీజేపీ 2, ఇతరులు 1).

  • మొయినాబాద్‌ ( వార్డులు సంఖ్య: 26): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7, బీజేపీ 4, ఇతరులు 5).

  • శంకర్‌పల్లి ( వార్డులు సంఖ్య: 15): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 4, బీజేపీ 0, ఇతరులు 2).

  • పరిగి ( వార్డులు సంఖ్య: 18): హంగ్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8, బీజేపీ 0, ఇతరులు 2).

  • తాండూర్‌ ( వార్డులు సంఖ్య: 36) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 12, బీజేపీ 3, ఇతరులు 2).

  • వికారాబాద్‌ ( వార్డులు సంఖ్య: 34) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 4, ఇతరులు 3).

  • అలియాబాద్‌ ( వార్డులు సంఖ్య: 20) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 7, బీజేపీ 3, ఇతరులు 2).

  • మూడుచింతలపల్లి ( వార్డులు సంఖ్య: 24) : బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 0).

  • ఎల్లంపేట ( వార్డులు సంఖ్య: 24): బీఆర్ఎస్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇతరులు 0).


9. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా: ఈ జిల్లాలో మొత్తం అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ పరమయ్యాయి.

  • ఆర్మూరు ( వార్డులు సంఖ్య: 36) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 4).

  • భీమ్‌గల్‌ ( వార్డులు సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 4, బీజేపీ 0, ఇతరులు 0).

  • బోధన్‌ ( వార్డులు సంఖ్య: 38) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13).

  • బాన్సువాడ ( వార్డులు సంఖ్య: 19) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు 2).

  • బిచ్కుంద ( వార్డులు సంఖ్య: 12) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 2, బీజేపీ 0, ఇతరులు 0).

  • కామారెడ్డి ( వార్డులు సంఖ్య: 49) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10, బీజేపీ 18, ఇతరులు 2).

  • ఎల్లారెడ్డి ( వార్డులు సంఖ్య: 12): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, బీజేపీ 0, ఇతరులు 1).


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ.. పలు అంశాలపై చర్చ

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

For More TG News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 08:09 PM