Home » YSRCP
ప్రభుత్వం ఏదైనా వైసీపీ నేతల మట్టిదందా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అందుబాటులో ఉన్న ఖనిజ సంపదను, ప్రభుత్వ భూములను విచ్చలవిడిగా దోచేశారు. కడప నగరానికి కూతవేటు దూరంలోని చింతకొమ్మదిన్నె మండలంలో దందా మరింతగా సాగింది.
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్ తగిలింది. మాచవరం పోలీస్ స్టేషన్‌లో వల్లభనేని వంశీపై ఇవాళ(గురువారం) కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను గురువారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలవనున్నారు. గవర్నర్‌తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్‌కు మరో షాక్ తగిలినట్టయింది. ఆయన సమీప బంధువు అర్జున్ రెడ్డికి నోటీసులిచ్చారు గుడివాడ పోలీసులు.
బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని కడప చిన్నచౌకు పోలీసులు హైదారబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలో వైసీపీ బైక్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని.. ఇరువర్గాలకు సర్ధి చెప్పారు.
జగన్ హయాంలో విధ్వంస పాలన జరిగిందని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ధ్వజమెత్తారు. ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
ఏపీలో టీడీపీ మద్దతు దారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి బ్రదర్స్ అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు.