Home » YS Jagan Mohan Reddy
కల్తీ మద్యం తయారు చేస్తున్నారని వారి కంపెనీని కామెరూన్ ప్రభుత్వ మంత్రి సీజ్ చేసింది నిజం కాదా అని మంత్రి అనగాని నిలదీశారు. వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డిలు జగన్ రెడ్డి బినామీలు కాదా అని అడిగారు.
జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదన్నారు మంత్రి సత్యకుమార్. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని.. వైసీపీ వచ్చేది లేది.. చచ్చేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
రాక్షసుల్లా ప్రవర్తించే వైసీపీ... రాజకీయ పార్టీని కాకుండా, ఓ దొంగల ముఠాని నడుపుతోందని యరపతినేని విమర్శించారు. జగన్ కుట్రలను, వైసీపీని ప్రజలు 53 గ్రేడ్ సిమెంట్‌తో పాతరేసి మళ్లీ పైకి లేవకుండా చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.
ఉద్యోగుల సంఘం డిమాండ్లను వైసీపీ పూర్తిగా విస్మరించిందని యనమల వ్యాఖ్యలు చేశారు. వారి సమస్యల గురించి వారితో ఎప్పుడూ చర్చలు జరపలేదని మండిపడ్డారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో మొత్తం పోలవరం ప్రాజెక్టుని వరదల్లో ముంచేశారని కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ(గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ పర్యటనను సైతం వైసీపీ నేతలు ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.
వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ కోర్టును ఆశ్రయించింది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్‌కు బదులుగా మరో నెంబర్ ఇచ్చారంటూ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్‌కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ షేర్ల బదిలీపై చెన్నైలోని NCLT అప్పీలేట్ ట్రిబ్యునల్ స్టేటస్ కో విధించింది. హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తమ షేర్ల బదిలీపై ఇచ్చిన తీర్పును చెన్నై లోని అప్పీలేట్ ట్రిబ్యునల్‌లో జగన్ తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సవాల్ చేశారు.
ఏపీలో జగన్ పార్టీ అంతా క్రిమినల్ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.