విషప్రచారాలు కట్టడి చేస్తాం.. ప్రతీది బహిర్గతం చేసేందుకు సిద్ధం: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 03 , 2026 | 02:48 PM
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు.
అమరావతి, జూన్ 3: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఏ ఆత్మ చెప్తే.. జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితుల్లో లేమని అన్నారు. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశ్యంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెప్తామని.. విషప్రచారాలను కట్టడి చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారిలో అత్యధిక శాతం టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన వారే అని మంత్రి అన్నారు. డీఎస్సీ పోస్టింగ్ అనేది ఎన్నో కుటుంబాలకు ఎమోషనల్ బాండింగ్ అని తెలిపారు. ఏ కోర్టు కేసూ అడ్డంకి రాకుండా అన్ని సమస్యలూ పరిష్కరించి గౌరవ ప్రదంగా ప్రతి ఒక్కరికీ నియామకపత్రాలు అందజేశామన్నారు. లీక్‌కు స్కోప్ లేకపోవటంతో స్పోర్ట్స్ కోటాపై పడ్డారని మండిపడ్డారు. బీకాంలో కెమిస్ట్రీ చదివిన ఘనులంతా గొడ్డలిపార్టీలో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారని సెటైర్ విసిరారు. సమాధానం అవసరం లేదని, సమస్య సృష్టించటమే అవసరం అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు.
గొడ్డలి పార్టీ అధికారంలో ఉండగా 2022లో తెచ్చిన హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగానే డీఎస్సీ నియామకాలు జరిగాయని హోంమంత్రి చెప్పారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు పెట్టిన మహామహులు బ్రిడ్జి స్పోర్ట్స్ గురించి అవగాహన లేమితో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అంటే గొడ్డలి పార్టీ నేతలు నిర్వహించిన పేకాట క్లబ్‌లు కాదన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్1 నియామకాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో అందరికీ తెలుసని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి.. జగన్‌కు లేదు: మంత్రి నారాయణ
పెండింగ్‌లో ఉన్న రహదారి ప్రాజెక్టులు వేగంగా పూర్తి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telugu News