Home » YCP
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మావిగన్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో అంతర్గతంగా ఈ వ్యవహారంపై మదనం జరుగుతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడుకు చెందిన వైసీపీ నేత బూతు పురాణం తాజాగా బయటపడింది. తన ఫోన్ ఎత్తడం లేదని వ్యవసాయ శాఖ అధికారిపై వైసీపీ నేత వేలాద్రి నోరు పారేసుకున్నాడు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ నేతలకు అసూయ ఎక్కువై, కడుపుమంటతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం ఇస్తే ఉత్తరాంధ్రను, విశాఖను కబ్జా చేసి, ఎవరూ బతకలేకుండా ఆస్తులు లాక్కున్నారని ఆరోపించారు.
‘లాభాల్లోని విద్యుత్ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు.
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై శుక్రవారం రాజమండ్రి జిల్లా కోర్టులో విచారణ జరగనుంది.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సర్పవరం ఇన్‌ఛార్జి సీఐ రవికుమార్‌ను ఉన్నతాధికారులు కేసు దర్యాప్తు నుంచి తొలగించారు.
హత్యలు చేయటం, సాక్షుల్ని బెదిరించటం, రేటు మాట్లాడటం, కుటుంబసభ్యులను, జడ్జిలను బెదిరించాలని చూడటం మాజీ సీఎం జగన్‌కు అలవాటని మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ తరహాలోనే వైసీపీ నాయకులు శవరాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
2024 ఎన్నికల సమయంలో కాకర్ల వెంకట్రామిరెడ్డి వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అశోక్ బాబు తెలిపారు. బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగానే అప్పట్లో వెంకట్రామిరెడ్డిపై నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.
డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు డబ్బులు ఇచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ బెదిరింపులకు భయపడి నలుగురు సాక్షులు పోలీసులను ఆశ్రయించారు.
వైసీపీలో ఈ మధ్య సామాజిక వర్గపోరు ఎక్కువైందన్న ప్రచారం జరుగుతోంది. ఓ నియోజకవర్గంలో కాపు మాజీ మంత్రికి రెడ్డి కమ్యూనిటీ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందన్న వాదన వినిపిస్తోంది..