Share News

టీడీపీ బలోపేతానికి కృషి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:43 PM

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి
కండువా కప్పి ఆహ్వానిస్తున్న రాఘవేంద్రరెడ్డి, రామకృష్ణారెడ్డి

మంత్రాలయం/కోసిగి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆదివారం మాధవరంలోని తన నివాసంలో కోసిగి మండలం కామన్‌దొడ్డి గ్రామంలోని వైసీపీకి చెందిన వంద కుటుంబాలు ఆదివారం టీడీపీలో చేరాయి. వీరికి ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి, మంచాల సింగిల్‌ విండో అధ్యక్షులు రామకృష్ణారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దొడ్డయ్య, నాగరాజు, వీరేష్‌, మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో కోసిగి మండల నాయకులు పల్లెపాడు ముత్తురెడ్డి, రామిరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నర్సిరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామకృష్ణ తాయన్న ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ రఘునాథరెడ్డి, రాకేష్‌ రెడ్డి, రాజారెడ్డి, ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:43 PM