Home » WPL
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో గుజరాత్ జెయింట్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ(శనివారం) ఉత్కంఠభరితంగా సాగిన పోరులో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. నవీ ముంబయి వేదికగా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడ్డాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) నవీ ముంబయి వేదికగా గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ పోటీ పడుతున్నాయి. టాస్ ఓడిన గుజరాత్.. తొలుత బ్యాటింగ్ చేసింది.
డబ్ల్యూపీఎల్ 2026 శుక్రవారం ఘనంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆర్సీబీకి ఓటమి తప్పదనుకున్న స్థితిలోనాడిన్ డి క్లెర్క్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్నందించింది. తమ విజయంపై కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్ అనంతరం మాట్లాడింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఆరంభ మ్యాచులోనే అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఆఖరి బంతి వరకు పోరాడి.. గెలుపు అంచున కూడా లేని ఆర్సీబీ జట్టు.. అనూహ్యంగా ముంబై ఇండియన్స్‌పై 3 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఓటమిపై ఎంఐ కెప్టెన్ హర్మన్ మాట్లాడింది.
మహిళల ప్రీమియర్ లీగ్(WPL-2026) సీజన్ షురూ అయింది. తొలి మ్యాచ్‌లో నవీ ముంబై వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన టాస్ గెలిచింది.
గురువారం రోజు డబ్ల్యూపీఎల్ 2026 లీగ్ కు సంబంధించి నిర్వాహకులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లానింగ్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో..! ఇప్పటివరకు కెప్టెన్‌గా ఉన్న లానింగ్.. యూపీకి వెళ్లిపోవడంతో.. ఆ జట్టుకు సారథిగా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ నియమితురాలైంది. వరుసగా మూడు సీజన్లలో ఫైనల్లో ఓటమి చవిచూసిన ఈ జట్టు.. ఈసారి కప్పు కొట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.