Share News

Gujarat Giants Win: బోణీ కొట్టిన గుజరాత్ జెయింట్స్

ABN , Publish Date - Jan 10 , 2026 | 07:41 PM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో గుజరాత్‌ జెయింట్స్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇవాళ(శనివారం) ఉత్కంఠభరితంగా సాగిన పోరులో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. నవీ ముంబయి వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ తలపడ్డాయి.

Gujarat Giants Win: బోణీ కొట్టిన గుజరాత్ జెయింట్స్
GG vs UPW,

స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL-2026)లో గుజరాత్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) ఉత్కంఠభరితంగా సాగిన పోరులో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. నవీ ముంబయి వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌(GG vs UPW) తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్ ఫోయిబ్‌ లిట్చ్‌ఫీల్డ్(Phoebe Litchfield) (78) విజయం కోసం పోరాడిన ఫలితం లేకుండా పోయింది.


అలానే మెక్ లానింగ్‌ (30), శోభన (27*), శ్వేతా షెరావత్ (25) కూడా విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. కీలక సమయంలో గుజరాత్ బౌలర్లు వికెట్లు తీసి తమ జట్టును గెలిపించారు. రేణుకా ఠాగూర్, జార్జియా, సోఫీ డివైన్ తలో రెండు వికెట్లు సాధించారు. అలానే గార్డనర్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో వికెట్ తీశారు. టాస్ ఓడిన గుజరాత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ ఆష్లీ గార్డనర్( Ashleigh Gardner)(65) అర్ధ సెంచరీతో చెలరేగి ఆడింది. ఆమెకు తోడుగా అనుష్క శర్మ(44), సూఫీ డివైన్(38)లు రాణించడంతో గుజరాత్ 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక యూపీ బౌలర్లలో సూఫీ ఎక్లెస్టోన్ 2, డియాండ్రా డాటిన్ తలో వికెట్ తీసుకున్నారు. మొత్తంగా 208 పరుగుల భారీ టార్గెట్‌ను యూపీ ముందుంచింది గుజరాత్ జెయింట్స్. అయితే యూపీ వారియర్స్ ఛేదనలో విఫలమై.. తొలి ఓటమిని మూటగట్టుకుంది.


ఇవి కూడా చదవండి:

సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్

కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్

Updated Date - Jan 10 , 2026 | 08:44 PM