Share News

Shanku Flowers: శంఖం పువ్వులు భారతదేశంలో రైతుల తలరాతలను మార్చబోతున్నాయా?

ABN , Publish Date - Jan 10 , 2026 | 06:33 PM

దేవుని పూజ కోసం ఇప్పటివరకూ ఇంటి పెరట్లో పెంచుకునే శంఖు పూల తీగలు ఇప్పుడు సిరులు కురిపించబోతున్నాయి. సహజ నీలం రంగు టీ, ఫుడ్ కలర్, టెక్స్‌టైల్ డైలకు డిమాండ్ పెరగడంతో మహిళా రైతులకు మంచి ఆదాయం, స్వావలంబన అవకాశాలు కలుగుతున్నాయి.

Shanku Flowers: శంఖం పువ్వులు భారతదేశంలో రైతుల తలరాతలను మార్చబోతున్నాయా?
Butterfly Pea Flower India

ఆంధ్రజ్యోతి, జనవరి 8: ఒకప్పుడు ఇంటి పెరట్లో, గోడల మీద సాధారణ తీగ మొక్కలాగా పూచే శంఖం పువ్వులు లేదా శంఖు పూలు (Butterfly Pea Flower / Clitoria ternatea) ఇప్పుడు భారతదేశంలో వాణిజ్య స్థాయి సాగుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సహజ నీలం రంగు డైలు, బ్లూ టీకి డిమాండ్ పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

అస్సాంలోని అంతాయ్‌గాలో నీలం బ్రహ్మ అనే మహిళ రెండేళ్ల క్రితం మొదటిసారి ఆరబెట్టిన శంఖు పూలు అమ్మి రూ.4,500 సంపాదించారు. దీంతో ఆమె ఇప్పుడు సోలార్ డ్రయ్యర్లతో చిన్న వ్యాపారం ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లో పుష్పల్ బిస్వాస్ ఈ శంఖు పూల దిగుబడిని 50 కిలోల నుంచి 80 కిలోలకు పెంచి ఆదాయం పెంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వర్షికా రెడ్డి, ఢిల్లీలో నితీశ్ సింగ్ వంటి వ్యాపారులు వేలాది మంది రైతులతో కలిసి ఈ పంటను ప్రోత్సహిస్తున్నారు.


ఈ పూలతో ఏం చేస్తారు?

ఈ శంఖు పూలను వేడి నీళ్లలో వేస్తే అద్భుతమైన నీలం రంగు టీ వస్తుంది.. దీనిలో కొంచెం నిమ్మరసం వేస్తే ఊదా రంగుకి మారుతుంది. ఇది ఆ పూల రసంలోని మరో బ్యూటీ. సహజ ఫుడ్ కలరింగ్, టెక్స్‌టైల్ డైలకు దీనిని ఉపయోగిస్తారు. దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా సహాయపడుతుందని చెన్నైకి చెందిన శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే దీని మీద మరిన్ని పరిశోధనలు అవసరం ఉందని కూడా అంటున్నారు.

థాయ్‌లాండ్, ఇండోనేసియా తర్వాత భారత్‌లో ఈ శంఖుపూల సాగు వేగంగా పెరుగుతోంది. అమెరికా FDA 2021లో ఆహారంలో దీనిని అనుమతించగా, యూరప్‌లో కొన్ని అనుమానాలతో ప్రస్తుతానికి 'నావెల్ ఫుడ్'గా మాత్రమే వర్గీకరించారు. మహిళా రైతులకు ఆదాయం, స్వావలంబన ఇస్తున్న ప్రకృతి బహుమతిగా ఇచ్చిన ఈ పంట.. సమీప భవిష్యత్‌లో వాణిజ్య పంటగా మారి రైతులకు సిరులు కురిపించబోతోందని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఐఏఎస్ అధికారిపై తప్పుడు కథనం.. ఐఏఎస్ సంఘం రియాక్షన్ ఇదే..

ప్రజలకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ కీలక హెచ్చరికలు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 07:18 PM