Share News

WPL 2026: ఢిల్లీ కెప్టెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్

ABN , Publish Date - Jan 09 , 2026 | 03:03 PM

గురువారం రోజు డబ్ల్యూపీఎల్‌ 2026 లీగ్‌ కు సంబంధించి నిర్వాహకులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీ వారియర్స్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది.

 WPL 2026: ఢిల్లీ కెప్టెన్‌పై ప్రతీకారం తీర్చుకున్న ఆస్ట్రేలియా ప్లేయర్

స్పోర్ట్స్ డెస్క్: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్(WPL-2026) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ (శుక్రవారం) తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, బెంగళూరు మధ్య జరగనుంది. అయితే ఈ నాలుగో ఎడిషన్ ప్రారంభానికి ముందు ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్న(గురువారం) ఈ లీగ్‌ కు సంబంధించి ఓ ప్రీ షో జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ వారియర్స్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌(Meg Lanning), ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ జెమీమా రోడ్రిగ్స్‌ను మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. లానింగ్, జెమీమాను సరదగా స్లెడ్జింగ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(WPL Funny Moments) అవుతోంది.


గురువారం నాడు డబ్ల్యూపీఎల్‌ 2026 లీగ్‌‌కు సంబంధించి నిర్వాహకులు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొన్నారు. సరదాగా సాగిన ఈవెంట్‌లో 'ట్రూత్ ఆర్ డేర్' అనే ఓ పోటీ జరిగింది. ఇందులో హోస్ట్ ఇచ్చిన డేర్ ప్రకారం యూపీ వారియర్స్‌ కెప్టెన్‌ లానింగ్, డీసీ కెప్టెన్‌ జెమీమాను స్లెడ్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఫీల్డర్లు కెప్టెన్‌ మాట వినకుండా, మైదానంలో డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలుస్తుందంటూ సరదాగా వ్యాఖ్యానించింది లానింగ్‌. ఆమె ఈ కామెంట్స్ చేయడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు.


లానింగ్‌ ఫన్నీ కామెంట్స్‌కు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, బెంగళూరు కెప్టెన్‌ స్మృతి మందాన నవ్వు ఆపుకోలేక టేబుల్‌పై చేతులు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి అభిమానులు.. జెమీ(Jemimah Rodrigues) డ్యాన్స్‌లతో లానింగ్ విసిగిపోయినట్టుందంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో డీసీలో సహచర ప్లేయర్లు కావడం గమనార్హం. గత సీజన్ వరకు డీసీ కెప్టెన్‌గా లానింగ్ ఉంది. అయితే.. ఈసారి ఆమెను వేలానికి వదిలేసిన ఢిల్లీ.. జెమీమాను కెప్టెన్ చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కార్యక్రమంలో లానింగ్ స్లెడ్జింగ్ చేసిందంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన రుతురాజ్‌ గైక్వాడ్

టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్‌ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!

Updated Date - Jan 09 , 2026 | 04:57 PM