Share News

GGW VS UPW: చెలరేగి ఆడిన ఆష్లీ గార్డనర్.. గుజరాత్ భారీ స్కోర్

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:23 PM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) నవీ ముంబయి వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌ పోటీ పడుతున్నాయి. టాస్‌ ఓడిన గుజరాత్.. తొలుత బ్యాటింగ్ చేసింది.

GGW  VS UPW:  చెలరేగి ఆడిన ఆష్లీ గార్డనర్..  గుజరాత్ భారీ స్కోర్
GGW vs UPW

స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 2026లో భాగంగా ఇవాళ(శనివారం) నవీ ముంబయి వేదికగా గుజరాత్‌ జెయింట్స్‌, యూపీ వారియర్స్‌(GG vs UPW) పోటీ పడుతున్నాయి. టాస్‌ గెలిచిన యూపీ వారియర్స్‌ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి..207 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డనర్(Ashleigh Gardner)(65) అర్ధ సెంచరీతో చెలరేగి ఆడింది. ఆమెకు తోడుగా అనుష్క శర్మ(44 పరుగులు) రాణించింది. అలానే సూఫీ డివైన్ 38 పరుగులు చేసింది. ఇక యూపీ బౌలర్లలో సూఫీ ఎక్లెస్టోన్ 2, డియాండ్రా డాటిన్, శిఖా పాండే తలో వికెట్ తీసుకున్నారు. మొత్తంగా యూపీ ముందు 208 పరుగుల భారీ టార్గెట్ ను గుజరాత్ జెయింట్స్ ఉంచింది.


గుజరాత్ బ్యాటింగ్‌లో ఓపెనర్ సూఫీ డివైన్ తొలి నుంచి యూపీ బౌలర్లపై విరుచుకుపడింది. మరో ఓపెనర్ బెత్ మూనీ కేవలం 13 పరుగుల చేసి ఔటైంది. 41 పరుగుల వద్ద తొలి వికెట్ పడినా.. అనుష శర్మతో కలిసి సూఫీ స్కోర్ బోర్డు పరుగెత్తించింది. డివైన్ 20 బంతుల్లో 38 పరుగులు చేసి.. శిఖా పాండే బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ఆష్లీ గార్డనర్ విధ్వంసం సృష్టించింది. యూపీ బౌలర్లపై దాడిని తీవ్రతరం చేసింది. కేవలం 41 బంతుల్లోనే 65 పరుగులు చేసి.. గుజరాత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించింది. చివర్లో జార్జియా వేర్‌హామ్(27), భారతీ ఫుల్మాలి(14) ఫర్వాలేదనిపించారు.


ఇవి కూడా చదవండి:

కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్

అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!

Updated Date - Jan 10 , 2026 | 04:55 PM