Home » West Bengal
పద్మశీ అవార్డు గ్రహీత, భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన సాధువు కార్తీక్ మహారాజ్ (స్వామీ ప్రదీప్తానంద) టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనపై 2013 నుంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.
సామూహిక అత్యాచారం జరిగిందన్న ఆరోపణలపై బాధితురాలికి ఈనెల 26న కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలిపై ఒంటిపై గాయాలున్నట్టు అధికారులు ధ్రువీకరించారు.
కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచార ఘటనలో స్థానిక పోలీసులు కళాశాల సెక్యూరిటీ గార్డును తాజాగా అరెస్టు చేశారు. ఘటన గురించి ఫిర్యాదు చేయడంలో అతడు విఫలమయ్యాడని తేల్చారు.
పశ్చిమ బెంగాల్‌లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో (Kolkata Gang Rape Case) పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇదే సమయంలో ఈ విషయంపై టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణను ప్రారంభించిన పోలీసులు మరింత సమాచారం కోసం కాలేజీ ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
బెంగాలీ మాట్లాడే 300 నుంచి 400 మంది వలస కార్మికులను సరైన డాక్యుమెంట్లు చూపించినప్పటికీ రాజస్థాన్‌లోని ఒక భవనంలో ఈరోజు నిర్బంధించినట్టు తనకు సమాచారం ఉందని మమతా బెనర్జీ చెప్పారు.
కాళీగంజ్‌లో తమ పార్టీ విజయానికి టీఎంసీ కార్యకర్తలు సోమవారం విజయోత్సవాలు చేసుకుంటుండగా విషాదం చోటుచేసుకుంది. ఓ సీపీఎం కార్యకర్త ఇంటి వద్ద...
Teen Girl: ఓ నాటు బాంబు తమన్నా ఖాతూన్ అనే బాలిక దగ్గర పేలింది. దీంతో బాలిక తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.
ఉప ఎన్నికల్లో టీఎంసీ 55 శాతం ఓటింగ్ షేర్ పొందగా, బీజేపీ 28 శాతం, కాంగ్రెస్ 15 శాతం ఓటింగ్ షేర్ పొందాయి. కలీగంజ్ సీటు తిరిగి గెలుచుకుంటామని టీఎంసీ మొదట్నించీ ధీమాతో ఉండగా, ఈ నియోజకవర్గంలో 48 శాతం మైనారిటీ ఓట్లు ఉండటంతో బీజేపీ ప్రధానంగా హిందూ ఓట్లుపైనే ఫోకస్ చేసింది.
గుజరాత్‌లో బీజేపీ ఒక స్థానంలోనూ, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో గెలుపు సాధించాయి. కేరళలోని నిలాంబర్ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్‌లోనూ ఆప్ పాగా వేసింది.