Share News

Mahua Moitra: అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి... మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 29 , 2025 | 06:57 PM

సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయని మహువా మొయిత్రా ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసలకు కేంద్ర నాయకత్వమే కారణమంటూ విమర్శలు గుప్పించారు.

Mahua Moitra: అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి... మహువా మొయిత్రా సంచలన వ్యాఖ్యలు
Mahua Moitra and Amit Shah

కోల్‌కతా: తన వ్యాఖ్యలతో తరచూ వివాదాస్పదమవుతున్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) మరోసారి వివాదం రేపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'అమిత్‌షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోకి బంగ్లా అక్రమ వలసదారుల ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు మహువా మెయిత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.


'భారతదేశ సరిహద్దులకు రక్షణ లేకపోతే వందలాది మంది చొరబాటుదారులు లోపలకు అడుగుపెట్టి మన మహిళలను అగౌరవపరుస్తూ మన భూములు లాక్కుంటుంటే మనం అమిత్‌షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి. అది మన బాధ్యత' అని మహువా మొయిత్రా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చొరబాటుదారుల వల్ల జనాభాలో మార్పులు వస్తున్నాయని (Demograpghic Changes) చెప్పారని, అప్పుడు ముందు వరుసలో ఉన్న హోం మంత్రి నవ్వుతూ, చప్పట్లు చరిచారని ఆమె అన్నారు. సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసలకు కేంద్ర నాయకత్వమే కారణమంటూ విమర్శలు గుప్పించారు.


విద్వేష ప్రసంగం: బీజేపీ

కేంద్ర మంత్రి అమిత్‌షాపై మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. విద్వేషంతో విషం చిమ్మేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నేత ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. మమతా బెనర్జీ టీఎంసీ నిర్దేశకత్వంలో ఆమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, మహువా మొయిత్రా వ్యాఖ్యలపై సందీప్ మజుందార్ అనే స్థానికుడు కృష్ణానగర్ కొత్వాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి..

మహిళా రోజ్‌గార్ యోజనను ప్రకటించిన సీఎం

మోదీ తల్లిపై వ్యాఖ్యలు.. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 07:11 PM