Odisha Medical Student Assault: 'నా కూతుర్ని ఒడిశాకు పంపండి': సీఎం మమత బెనర్జీని కోరిన బాధితురాలి తండ్రి
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:15 PM
పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఆమెను ఒడిశా పంపించాలంటూ..
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్‌రేప్ ఘటన యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి భావోద్వేగ లేఖ రాశారు. 'ఆమె నడవలేకపోతోంది, బెడ్‌రెస్ట్‌పై ఉంది. ముఖ్యమంత్రి, డీజీపీ, ఎస్‌పీ లాంటి అందరూ సహాయం చేస్తున్నారు. కానీ ఆమె భద్రత కోసం మా కుమార్తెని ఒడిశాకు తీసుకెళ్లడానికి అనుమతించాలి. స్థానికంగా ఆమెకు ప్రమాదం' అని సీఎంను బాధిత విద్యార్థిని తండ్రి తన లేఖ ద్వారా వేడుకున్నారు. సెక్యూరిటీ లోపాలు కూడా ఘటనకు కారణమని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి వెస్ట్ బెంగాల్ పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్హీ ఈ ఘటనను 'అత్యంత దారుణమైనది' గా వర్ణించారు. విద్యార్థినిపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ ప్రభుత్వం బాధితురాలికి అండగా ఉంటుందని చెప్పారు.
బాధితురాలికి న్యాయం చేయాలని.. అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని దుర్గాపూర్‌లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. దీంతో వైద్య కళాశాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్య కళాశాల ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇంకోవైపు ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోరింది. తమ కూతురిపై అత్యాచార విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు.. హుటాహుటీన ఒడిశా నుంచి ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా, 2024, ఆగస్టు 9వ తేదీన కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థిని కూడా ఇదే తరహాలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది.
ఇవి కూడా చదవండి..
కీలక పరిణామం.. ప్రధాని మోదీకి ట్రంప్ నుంచి ఆహ్వానం..!
For More National News And Telugu News