PM Modi Lands in Kolkata: కోల్‌కతా చేరిన మోదీ.. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించనున్న ప్రధాని
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:33 PM
ప్రధాని మోదీ కోల్‌కతా రాకపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, మోదీ ఎప్పుడు కోల్‌కతా వచ్చినా ప్రజల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుందని అన్నారు. ఈరోజు అదే ఉత్సాహం ప్రజలు, కార్యకర్తల్లో కనిపించిందని చెప్పుకొచ్చారు.
కోల్‌కతా: మిజోరం, మణిపూర్, అస్సాంలో రెండ్రోజుల పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం రాత్రి కోల్‌కతా (Kolkata) చేరుకున్నారు. ఆయనకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోల్‌కతాలో రెండ్రోజుల పాటు జరుగనున్న 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను ప్రధానమంత్రి సోమవారం నాడు ప్రారంభించనున్నారు.
'అసోంలో ఈరోజు పర్యటన ముగియగానే కోల్‌కతా చేరుకున్నా. సోమవారం నాడు ఇక్కడ జరిగే కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటా. ఆ తర్వాత బిహార్‌లోని పూర్ణియా వెళ్తాను. ఎయిర్‌పోర్ట్ నూతన టెర్నినల్ బిల్డింగ్‌ను ప్రారంభించనున్నాను. దీనితోపాటు రూ.36,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభిస్తా' అని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ప్రధాని మోదీ కోల్‌కతా రాకపై కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, మోదీ ఎప్పుడు కోల్‌కతా వచ్చినా ప్రజల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుందని, ఈరోజు అదే ఉత్సాహం ప్రజలు, కార్యకర్తల్లో కనిపించిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరిన్నిసార్లు ప్రధాని ఇక్కడ పర్యటిస్తారని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం.. బెంగాల్‌లోనూ ప్రకంపనలు
నేను శివ భక్తుడిని, నేను విషం అంతా మింగేస్తాను
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి