Home » Weather
హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 48 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో..
తెలంగాణతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంది.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
కృష్ణానదిలో వరద ఉదృతి నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని కృష్ణజిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్టీవోలను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షానికి పలు కాలనీలు నీట మునిగాయి. నీట మునిగిన కాలనీలను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి, కమిషనర్ అనురాధ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీగా వర్షాలు పడే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో పలువురు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో ఫోన్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.