Heavy Rain Alert: వచ్చే 3 రోజులు కుండపోత వర్షాలు
ABN , Publish Date - Oct 21 , 2025 | 03:54 PM
ఏపీ ప్రజలు అలర్ట్ చేసే వార్తను విశాఖపట్నం వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి బంగాళాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీ ప్రజలు అలర్ట్(Rain Alert) చేసే వార్తను విశాఖపట్నం వాతావరణ శాఖ చెప్పింది. నైరుతి బంగాళాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ తెలిపింది. భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, రేపు(బుధవారం)మధ్యాహ్నం నాటికి ఉత్తర తమిళనాడు- దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు– ఏపీలోని దక్షిణ కోస్తా వైపు కదులుతూ తదుపరి 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన (Bay of Bengal Low Pressure) ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు, తెలంగాణలోని కొన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు కరుస్తాయని ఐఎండీ తెలిపింది. మంగళవారం, బుధవారం, గురువారం ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే(Rainfall Prediction) అవకాశం ఉంది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి మత్స్యకారులు(Fishermen Warning) వేటకు వెళ్ళకూడదని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 ప్రజల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని.. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఐఏండీ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ