Home » Visakhapatnam
డైనమిక్ సిటీ విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్‌ను లాంఛ్ చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. అన్ని కోణాలనుంచి వచ్చిన ఈ పెట్టుబడిలో గెగావాట్-స్కేల్ డేటా సెంటర్ల రూపంలో మౌలిక సదూపాయాలు వికసిత్ భారత్‌కి దోహదం చేస్తాయని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం నమోదు కావడానికి సిద్ధమైంది. మంత్రి నారా లోకేష్ కృషితో విశాఖపట్నంలో దేశంలోనే తొలి గూగుల్ AI హబ్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరింది.
తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామానికి చేరుకోవాలంటే ఈ వాగును దాటాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదకర పరిస్థితిలోనే గిరిజనలు ఒకరికొకరు సాయం చేసుకుని వాగు దాటుతున్నారు.
విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో నేడు వైఎస్ జగన్ పర్యటించనున్నారు. మాకవరపాలెం మెడికల్ కాలేజ్‌ని సందర్శించనున్నారు. అయితే, ఈ నేపథ్యంలో జగన్‌కు నిరసన సెగ తగిలింది.
ద్రోణి ప్రభావంతో ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రూట్ మళ్లింపు, జన సమీకరణ, సభలు సమావేశాలు ర్యాలీలకు అనుమతి లేదని విశాఖ నగర్ పోలీస్ కమిషనర్, అనకాపల్లి ఎస్పీ స్పష్టం చేశారు.
జగన్ పర్యటనకు అనుమతి ఇస్తూనే 18 కండిషన్లు పెట్టారన్నారు. పోలీసులు ఇన్ని నిబంధనలు పెట్టడం సమంజసం కాదని... పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నామని మాజీ మంత్రి తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం పాపాలు తమకు శాపాలుగా మారాయని సత్యకుమార్ వ్యాఖ్యలు చేశారు. పీపీపీకి ప్రైవేటైజేషన్‌కు తేడా తెలియకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైద్య కళాశాలలో నిర్మించి ఉంటే ఇప్పుడు ఈ సమస్య ఉండేది కాదన్నారు.
మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలో మీటర్ల జాతీయ రహదారిపై కాన్వాయ్‌తో రావడానికి వైసీపీ శ్రేణులు అనుమతులు కోరినట్లు తెలిపారు. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌పై మాజీ సీఎం జగన్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
భారత నౌకదళంలోకి మరో యాంటి సబ్ మెరైన్ వార్‌ఫైర్ నౌక INS ఆండ్రోత్ చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ నౌకని నిర్మించారు. ఈ నౌక కలకత్తాకు చెందినది.