Share News

CM Chandrababu: ఏపీలో పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్

ABN , Publish Date - Nov 14 , 2025 | 03:02 PM

రిలయెన్స్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది.

CM Chandrababu: ఏపీలో పెట్టుబడులకు రిలయెన్స్ గ్రీన్ సిగ్నల్
CM Chandrababu

విశాఖపట్నం, నవంబర్ 14: విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏపీపై నమ్మకం ఉంచి... భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.


ఒక జీడబ్ల్యూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు రిలయెన్స్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో అత్యంత అధునాతనమైన జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్లను హోస్ట్ చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్‌ను రిలయెన్స్ ఏర్పాటు చేయనుంది. జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ గిగావాట్ - స్థాయి ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో పని చేసేలా ఏఐ - డేటా సెంటర్‌ను రిలయెన్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

chand-rel1.jpg


జామ్ నగర్, ఏపీలోని రెండు ఏఐ డేటా సెంటర్లతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌లలో ఒకటిగా రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్‌ రూపుదిద్దుకోనుంది. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న ఏఐ డేటా సెంటర్‌ కోసం 6 జీడబ్ల్యూపీ సౌర విద్యుత్ ప్రాజెక్టును రిలయెన్స్ ఏర్పాటు చేయనుంది. కర్నూలులో 170 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యంతో నిర్మించడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. రిలయెన్స్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగాలకు అవకాశాలు రానున్నాయి.


ఇవి కూడా చదవండి...

అవే కాంగ్రెస్‌ను గెలిపించాయ్.. జూబ్లీహిల్స్ ఫలితంపై మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ గెలుపుపై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 14 , 2025 | 05:37 PM