Home » Viral Video
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంతిమ యాత్ర ప్రారంభమయ్యాయి. పోలీస్ లాంఛనాలతో జరగనున్న ఈ అంత్యక్రియల్లో సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. అందెశ్రీ పార్థీవ దేహానికి సీఎం నివాళులర్పించారు.
చైనా కంపెనీ యూనిట్రీ రోబోటిక్స్ తయారు చేసిన Unitree G1 రోబోట్ కిచెన్‌లో బౌల్ ని సరిగా పట్టుకోలేకపోయింది. తర్వాత రోబోట్ కూడా నేలపై పడిపోయింది.
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఆడవేషంలో దొంగతనానికి పాల్పడ్డాడు. పొరిగింటి బయట ఉండే కొరియర్ పార్సిల్స్‌ను ఎత్తుకెళ్లిపోయాడు. సీసీటీవీ కెమెరాల కారణంగా అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
ఓ బస్ డ్రైవర్ బస్ నడుపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 80 కిలోమీటర్ల వేగంతో బస్సు నడుపుతూ సెల్ ఫోన్‌లో బిగ్‌బాస్ చూస్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీటిలోని మొసలి అత్యంత బలమైనది. నీటిలోని మొసలి నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు కోల్పోవాల్సిందే. భారీ ఏనుగులు, పులులు కూడా నీటిలోని మొసలిని చూస్తే భయపడతాయి. నీటిలోకి వస్తే సింహంపై కూడా మొసళ్లు దాడి చేస్తాయి.
ఎస్‌బీఐ ఉద్యోగి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్ కార్యాలయంలో వర్క్ చేస్తుండగా.. ఓ మహిళ తన చుట్టూ తిరుగుతూ ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీంతో ఈ వీడియో వైరల్ కాగా.. నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది.
బారాముళ్లా నుంచి బనిహాల్ వెళుతున్న రైలును గద్ద ఢీకొంది. దీంతో లోకో పైలట్‌కు గాయాలు అయ్యాయి. అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వ్యక్తి తన బట్టల షాపు ప్రమోషన్ కోసం ఎవ్వరూ ఊహించని ఆఫర్ పెట్టాడు. కేవలం 13 రూపాయలకే అన్ని రకాల షర్ట్స్ అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో వందలాది మంది షాపు దగ్గరకు చేరుకున్నారు. అంతమందిని చూసి షాపు యజమాని బిక్కచచ్చిపోయాడు.
గ్రామస్తులంతా కలిసి దున్నపోతు రెండవ పుట్టిన రోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశారు. ఇందుకోసం ఊరంతా ఏకమైంది. డీజేలు పెట్టించారు. షేరా మెడలో దండలు వేసి, బెలూన్లు కట్టి ఎంతో అందంగా ముస్తాబు చేశారు.
భారీ స్కామ్‌లలో జైలు పాలైన ఇద్దరు ఖైదీలు జైలు హాలులో రెచ్చిపోయారు. పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.