వేరే యువతితో ప్రియుడు.. ప్రశ్నించినందుకు ఏం చేశాడంటే..?
ABN , Publish Date - Sep 17 , 2026 | 07:43 AM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో ఓ యువతి కదులుతున్న కారు బానెట్‌పైకి ఎక్కి, వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన దృశ్యాలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్: లక్నోలోని గోమతీ నగర్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనేశ్వర్ మిశ్రా పార్క్ సమీపంలో ఓ యువతి కదులుతున్న కారు బానెట్‌పైకి ఎక్కి, వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన దృశ్యాలు నెటిజన్లను కలవరపెడుతున్నాయి. ఆ సమయంలో ఆమెను డ్రైవర్ కారుతో ఢీకొడుతూ ముందుకెళ్లడం సంచలనం రేపింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. యువతి చెప్పులు లేకుండా కారు ముందు నిలబడి దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నెమ్మదిగా ముందుకు కదిలించడంతో ఆమె ఒక్కసారిగా కారు బానెట్‌పైకి ఎక్కింది. అనంతరం బానెట్‌పై పడుకుని డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగుతూ వాహనాన్ని ఆపాలని పదేపదే కోరింది. అంతేకాకుండా బానెట్‌ను చేతితో కొడుతూ కారును ఆపాలని డిమాండ్ చేసింది. ఇంతలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. బానెట్‌పై యువతి ఉండగానే కారు కొంత దూరం నెమ్మదిగా వెళ్లి, ఆ తర్వాత వేగాన్ని పెంచినట్లు వీడియోలో కనిపిస్తోంది.
కారు వేగంగా దూసుకెళ్లడంతో కొంత దూరం ప్రయాణించిన అనంతరం యువతి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఆ తర్వాత కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే, తన బాయ్‌ఫ్రెండ్ మరో యువతితో కలిసి పార్క్‌కు రావడంతో యువతి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే వివాదం చెలరేగినట్లు సమాచారం. మరోవైపు, ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
35 వేల అడుగుల ఎత్తులో.. బొజ్జ గణపయ్య దర్శనం!.. వీడియో వైరల్
9 ఏళ్ల బాలుడికి యూట్యూబ్ ఛానల్.. యాడ్స్‌పై రూ.1.13 కోట్ల ఖర్చు