ఆగని కారు.. వాహనం వెంట ఓనర్ పరుగులు
ABN , Publish Date - Sep 15 , 2026 | 10:00 PM
డ్రైవర్ లేకున్నా రోడ్డుపై కారు వెళుతుంటే వెంట వాహనం ఓనర్ పరుగు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: డ్రైవర్ లేకున్నా రోడ్డుపై కారు వెళుతుంటే వెంట వాహనం ఓనర్ పరుగు తీస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. లూథియానాలో ఈ ఘటన వెలుగు చూసింది. నియంత్రణ తప్పిన ఈవీ కారు రోడ్డుపై వెళుతుండగా ఓనర్ మాత్రం వెనుక పరుగులు తీశాడు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. పక్కకు తప్పుకోవాలని అప్రమత్తం చేశాడు. కారు డోర్ లోపలి నుంచి లాక్ అయ్యిందని అతడు గోల చేశాడు.
ఆ తరువాత కొంత దూరం వెళ్లిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. అయినా కూడా కారు ముందు టైర్ మాత్రం తిరుగుతూనే కనిపించింది. కారు ముందుభాగం నుంచి పొగలు కూడా వచ్చాయి. ఈ లోపు కొందరు వాహనం విండో తలుపులు బద్దలు కొట్టి వాహనాన్ని ఆఫ్ చేశారు. ప్రమాదం తప్పినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కారు అదుపు తప్పడానికి కారణం మాత్రం తెలియరాలేదు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కారులోని సాఫ్ట్‌వేర్ లోపం ఈ పరిస్థితికి కారణం అయి ఉండవచ్చని కొందరు అన్నారు. పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్‌లో లోపం ఉండవచ్చని కొందరు చెప్పుకొచ్చారు. వీడియోకు మాత్రం వ్యూస్ విపరీతంగా వస్తున్నాయి. అసలే ఏఐపై రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్న తరుణంలో జనాలు ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగేలా చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇలాగైతే బార్బర్ జాబ్స్ కూడా పోతాయి: హర్ష్ గొయెంకా
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్