ఇలాగైతే బార్బర్ జాబ్స్ కూడా పోతాయి: హర్ష్ గొయెంకా
ABN , Publish Date - Sep 14 , 2026 | 08:07 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గొయెంకా తాజాగా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐతో వైట్ కాలర్ జాబ్స్‌కు ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని దాదాపుగా అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, శారీరక శ్రమ, మనుషులకు మాత్రమే ఉండే ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన బ్లూకాలర్ జాబ్స్‌కు ఏఐతో ముప్పు తక్కువన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్‌పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గొయెంకా షేర్ చేసిన ఓ బార్బర్ వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ఏఐ దెబ్బకు చివరకు బార్బర్ జాబ్స్ కూడా రిస్క్‌లో పడే ఛాన్స్ ఉందని వీడియోపై ఆయన కామెంట్ చేశారు.
కోడింగ్, రీసెర్చ్, డేటా విశ్లేషణ వంటి జాబ్స్‌ను ప్రస్తుతం ఏఐ సులువుగా చేయగలుగుతోంది. అయితే, మనుషులు తమ చేతులు, వేళ్లను ఉపయోగిస్తూ ఒడుపుగా చేసే కొన్ని పనుల్లో మాత్రం దారుణంగా తడబడుతోంది. కానీ ఇలాంటి పనులనూ చేసే ఏఐ మోడల్స్ అభివృద్ధిపై కంపెనీలు దృష్టిపెట్టాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మోడల్స్‌కు సరైన ట్రైనింగ్ ఇస్తే అవి బ్లూకాలర్ జాబ్స్‌లో రాటుదేలతాయని అంటున్నారు. ఈ దిశగా ఏఐకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు భారత్‌లో కూడా జోరందుకున్నాయి. ఇలాంటి ఓ ఏఐ ట్రెయినింగ్ వీడియోనే హర్ష్ గొయెంకా షేర్ చేశారు.
ఈ వీడియోలోని బార్బర్ తన టోపీపై కెమెరా పెట్టుకుని కస్టమర్‌కు షేవింగ్ చేశాడు. అతడు షేవింగ్ చేస్తున్న తీరు, డబ్బాలోంచి క్రీమ్‌ను ఒడుపుగా బయటకు తీస్తున్న వైనాన్ని అతడి నెత్తిపై ఉన్న కెమెరా రికార్డు చేసింది. ఈ వీడియోలతో నిపుణులు కొత్త ఏఐ మోడల్స్‌కు శిక్షణ ఇచ్చి, ఏఐ రోబోలను మనుషుల్లా పనులు చేసేలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మనుషుల్లగా ఒడుపుగా పనులు చేసే రోబోలను అభివృద్ధి చేసేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని కూడా కొందరు చెబుతున్నారు. బ్లూకాలర్ జాబ్స్‌కు ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేనప్పటికీ, ఆ దిశగా అడుగులు పడుతున్నాయనేది అత్యధిక శాతం మంది చెప్పేమాట.
ఈ వార్తలనూ చదవండి:
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు.. వీడియో వైరల్
గురుగ్రామ్‌లో దారుణం.. వెంటపడొద్దన్నందుకు మహిళా బైకర్‌ను..