Home » Vinayaka Chavithi
Ganesh Chaturthi 2025 Auspicious: వినాయక చవితి రోజు అత్యంత అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకోనుంది. పండుగరోజే సర్వర్థ్ సిద్ధి యోగ, రవి యోగ, ప్రీతి యోగ, ఇంద్ర యోగ, బ్రహ్మయోగాలు ఏర్పడున్నాయి.
పర్యావరణంతో పాటు భూగర్భ జలాశాయాలను కలుషితం చేసే ప్లాస్టర్ ఆఫ్ పారి్‌స(పీవోపీ) గణేశ్ విగ్రహాలను వాడొద్దని, వినాయక చవితి సందర్భంగా వాడవాడలా పర్యావరణ హిత మట్టి గణపతినే వాడాలని ఉన్నత న్యాయ స్థానాలు, పలు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి
రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండప నిర్వాహకులు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు.ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
వినాయక చవితి, మిలాద్ ఉల్ నబీ పండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
గణపతి ఉత్సవాలకు మరో 15 రోజులు మాత్రమే ఉండడంతో ఖైరతాబాద్ భారీ గణపతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గణపతి ఫినిషింగ్ పనులు జరుగుతుండగా అవి పూర్తి కాగానే ఆర్టిస్టులు రంగులద్దే పనులు ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరిపేందుకు నిర్వాహకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాము అనుకున్న ఎత్తులో మట్టి ప్రతిమలు లభ్యం కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే మండపాల్లో కొలువుదీరుస్తున్నారు.
గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ముందస్తు ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. కృత్రిమ కొలనుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ కోరుతూ బుధవారం టెండర్ నోటిఫికేషన్ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.