Share News

Commissioner RV Karnan: గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..

ABN , Publish Date - Aug 12 , 2025 | 07:31 AM

ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు.

Commissioner RV Karnan: గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..

హైదరాబాద్‌ సిటీ: ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌(GHMC Commissioner RV Karnan) తెలిపారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై భాగ్యనగర గణేశ్‌ ఉత్సవ సమితి, సంబంధిత శాఖలతో కర్ణన్‌ సమన్వయ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే నగరంలో దెబ్బతిన్న రోడ్లకు, ఊరేగింపు జరిగే రహదారుల్లో మరమ్మతు పనులు చేస్తున్నామన్నారు. ఈసారి ఎక్కువ క్రేన్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.


city3.2.jpg

అడిషనల్‌ సీపీ విక్రంసింగ్‌మాన్‌ మాట్లాడుతూ వర్షాలు పడే అవకాశమున్నందున మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో జాయింట్‌ సీపీ(ట్రాఫిక్‌) జోయల్‌ డేవిస్‌, అడిషనల్‌ కమిషనర్లు రఘుప్రసాద్‌, సుభద్ర, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ కోట శ్రీవాత్సవ, సీఈ రత్నాకర్‌, ఎలక్ట్రికల్‌ సీఈ ప్రభాకర్‌, జోనల్‌ కమిషనర్‌లు, హెచ్‌ఎండీఏ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌, టీఎ్‌సఆర్టీసీ, ట్రై కమిషనరేట్ల పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..

చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 12 , 2025 | 07:31 AM