Share News

CP Sudheer Babu: పండగలకు భారీ బందోబస్తు..

ABN , Publish Date - Aug 19 , 2025 | 08:08 AM

వినాయక చవితి, మిలాద్‌ ఉల్‌ నబీ పండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

CP Sudheer Babu: పండగలకు భారీ బందోబస్తు..

- అధికారుల సమీక్షా సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ: వినాయక చవితి, మిలాద్‌ ఉల్‌ నబీ(Vinayaka Chavithi, Milad-ul-Nabi) పండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda CP Sudheer Babu) అధికారులను ఆదేశించారు. కమిషర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాల వద్ద భద్రత, బందోబస్తు, ఏర్పాట్లపై సమీక్షించారు.


city4.2.jpg

గణేష్‌ ఉత్సవాల సమయంలోనే మిలాద్‌ ఉన్‌ నబీ పండగ వస్తుందని, ఈ సమయంలో నిర్వహించే ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేశ్‌ మండపాల వద్ద విద్యుత్‌ వంటి ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 08:08 AM