Share News

AP News: 27నుంచి కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:53 PM

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

AP News: 27నుంచి కాణిపాకం వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు

ఐరాల(కాణిపాకం): చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. 27న వినాయక చవితి(Vinakayakachaviti)తో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 28న ధ్వజారోహణం ,హంస వాహన సేవ, 29న స్వర్ణ నెమలి వాహనం, 30న మూషిక వాహన సేవ, 31న స్వర్ణ శేషవాహన సేవలు, సెప్టెబరు 1న ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహన సేవ,


nani2.2.jpg

2న గజ వాహన సేవ, 3న రథోత్సవం, 4న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ, 5న ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతరం ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా 6న అధికారనంది వాహన సేవ, 7న రావణబ్రహ్మ వాహన సేవ చంద్ర గ్రహణం కారణంగా ఉదయం నిర్వహిస్తారు. 8న యాళి వాహన సేవ, 9న సూర్యప్రభ వాహన సేవ, 10న చంద్రప్రభ వాహన సేవ, 11న కల్ప వృక్ష వాహన సేవ, 12న విమానోత్సవం, 13న పుష్పపల్లకి సేవ, 14న కామధేను వాహన సేవ, 15న పూలంగి సేవ, 16న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 12:53 PM