Home » Videos
బాసరలోని ప్రైవేట్ వేద పాఠశాల వివాదాలకు కేరాఫ్‌గా నిలిచింది. శ్రీ వేద భారతీ పీఠంలో వివాదాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. దీంతో, వేద పాఠశాల తీరుపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ మంత్రి నారా లోకేశ్ మరో హామీని నిలబెట్టుకొన్నారు. పాదయాత్రలో చెప్పినట్లుగా మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. చిన కాకానిలో ఆయన ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఏడున్నర ఎకరాల్లో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. అందుకోసం రూ. 52 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశంలోనే అత్యున్న స్థాయిలో ఈ ఆసుపత్రి ఉండాని లోకేశ్ ఆకాంక్షించారు. ఏడాదిలోపు ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ఆసుపత్రి ఉంటుందన్నారు.
ములుగు జిల్లా ఏటూరి నాగారం మంగపేట మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. కాటాపూర్, బీరెల్లి రంగాపూర్‌లలో వడగండ్ల వర్షం దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. వర్షం దాటికి తమ పంటలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసుపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన మృతిపై మిస్టరీ వీడింది. ఆయన ఎలా మరణించారంటే..
కిరణ్ చేబ్రోలు అరెస్ట్. అతడి అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల చాలా మంది.. తన తోటి టీడీపీ కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ, ఎంటీ మన సొంత కార్యకర్తను ఇలా ఇంత దారుణంగా అరెస్ట్ చేసి.. ఇలా ప్రెస్ ముందు నిలబెట్టాలా? ఒక టెర్రరిస్ట్‌లాగా చిత్రీకరించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు నమోదయింది. లక్షకు చేరువలో బంగారం ధరలు కొనసాగుతోన్నాయి. రెండు రోజుల్లో రూ.6 వేలు పెరిగింది. 10 గ్రామల మెలిమి బంగారం ధర రూ. 96,540 నమోదయింది.
అమెరికాలోని వ్యభిచార గృహాలతో సంబంధాలున్నాయే ఆరోపణలతో భారత సంతతికి చెందిన సీఈవో అరెస్టయ్యారు. క్లిన్ వాటర స్టార్టప్ గ్రేడియంట్ సీఈవోగా పని చేస్తున్న అనురాగ్ వాజపేయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ వ్యభిచార గృహాల్లో గడిపి.. అధిక మొత్తం చెల్లించిన వారి జాబితాలో అనురాగ్ వాజపేయ్ పేరు ఉన్నట్లు బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
ఏపీలో మాటలు మంటలు రేపుతోన్నాయి. కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అవినీతి, అక్రమాలు, నోటు దురుసు, దాడులకు పాల్పడిన వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో ఏం చేసినా చెల్లుతోందన్న వైసీపీ నేతలకు.. అదే రీతిలో ఇష్టాను సారంగా వ్యవహరించడంతో చట్టం తన పని తాను చేసుకు పోతుంది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులపై జీహెచ్ఎంసీ కమిషనర్, సిటీ చీఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌కు స్థానిక ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు ఇవ్వకుంటే.. ఇష్టానుసారం ఇళ్లను సీజ్ చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియలో ఒకే వార్త.. రెండు విధాలుగా ప్రచురించడం పట్ల టీడీపీ నత తిరునగరి జోత్స్న మండిపడ్డారు. సమాజంలో ఈ పత్రిక ద్వారా ఎలాంటి విదేష్వాలకు తెర తీస్తున్నారో ఆమె సోదాహరణగా వివరించారు. ఈ విధంగా వ్యవహరించే వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ఆమె సూచించారు. సదరు మీడియా చైర్మన్‌కు విలువలున్నాయా అంటూ టీడీపీ నేత టి జోత్స్న సందేహం వ్యక్తం చేశారు.