YS Sunitha: అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Aug 07 , 2025 | 03:34 PM

వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా పులివెందులలో జరిగుతున్న ఘటనలు చూస్తుంటే నాన్న(వివేకా) హత్య గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కడప: వైఎస్ వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నాన్న(వివేకా) హత్య గుర్తుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద, తన భర్త మీద కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఎన్ని కేసులు పెట్టినా సరే భయపడే పరిస్థితి లేదని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు తాను పోరాడుతూనే ఉంటానని సునీత స్పష్టం చేస్తున్నారు.

Updated at - Aug 07 , 2025 | 03:34 PM