మానవ మృగాలు ఫామ్ హౌస్‌లో ఉన్నాయి..!
ABN, Publish Date - Aug 25 , 2025 | 02:29 PM
మానవ మృగాలు ఫామ్ హౌస్ లో ఉన్నాయి..!
కొంత మంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటుంది.. వాళ్ల కొడుకులను ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతున్నారని బాధ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వారి ఉచ్చులో మీరు పడవద్దంటూ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు. సమస్యలుంటే తమకు చెప్పాలన్నారు. తమ మంత్రులు మీకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
ప్రొ. కోదండరామ్‌పై కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి ఆయన ఎమ్మెల్సీ పదవి తొలగించారని మండిపడ్డారు. ఇదేం పైశాచిక ఆనందం అంటూ బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. మళ్లీ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇస్తామని.. అది కూడా 15 రోజుల్లోనే ఇస్తామన్నారు. అపోహలకు లోను కాకండి.. అబద్ధాల సంఘం చెప్పే మాటలు నమ్మొద్దని సూచించారు. వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారని చెప్పారు. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనే లేవని.. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయని స్పష్టం చేశారు. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటి వారని అభివర్ణించారు. వాళ్లు తెలంగాణ సమాజం బాగు కోరుకోరని పేర్కొన్నారు. వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండ నివ్వరన్నారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కోదండరాం సార్ మంచోడు ..నేనైతే చెంపలు పగల కొడతా ..
శ్రీకాంతాచారి బ్రతికి ఉంటే గొప్పోడు అయ్యేవాడు..
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 25 , 2025 | 02:39 PM