Home » Vantalu
‘‘...నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియ...’’ కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ‘‘అనంత రంబా విశాలాక్షీ మహాదేవీ...’’ అంటూ మొదలుపెట్టి, వ్యాసుడికి, అతని శిష్యులకీ వడ్డించిన వంటకాల పట్టిక ఒకటి ఇచ్చాడు.
తెలుగులో కూడా పూరికలున్నాయి. కానీ, వ్యుత్పత్తి అర్థం వేరు. తెలుగులో పూరిక అంటే పొంగినదని! మూలద్రావిడ శబ్దం పూరి తెలుగులో బూర అయ్యింది. గాలి ఊదితే పొంగే బెలూనుని బూర అంటారు. బూరలా పొంగే వంటకాలు ప్రముఖంగా రెండున్నాయి.
తెల్లగా ప్రవహించే గోదావరి పాయల్లా చుట్టుకున్న కమ్మనైన ఒక మిఠాయి, కాజా! పేరుని బట్టి మొగలాయీల వంటకం అనిపిస్తుంది గానీ ఇది భారతీయ పాక సంపదలో భాగమే! ప్రాకృతంలో ఖాద్య - ఖజ్జగా మారిన ‘ఖాద్యం’ ఈ ఖాజా! కమ్మగా తినదగినదని దీని భావం! రెండున్నర వేల యేళ్ల ఆహార చరిత్రను మడతలుగా చుట్టి మధురిమలు నింపుకుంది కాజా! క్రీ.పూ. 3వ శతాబ్దిలో మౌర్యుల కాలం నుండే కాజాలు తినేవారనటానికి ఆధారాలున్నాయి.
చాక్లెట్ను చూడగానే పిల్లలకే కాదు... పెద్దలకూ నోరూరుతుంది. అయితే నిన్నటి దాకా చాక్లెట్లు తియ్యగా ఉంటాయనే తెలుసు. కానీ ‘జనరేషన్ జెడ్’ చాక్లెట్లు లుక్లోనే కాదు... రుచిలోనూ అనేక మార్పులతో ఆకర్షిస్తున్నాయి.
చల్లతో అన్నం పైలోకంలో పూర్వీకులు దిగివచ్చినంత కమ్మగా ఉండాలి. సాక్షాత్తూ అమ్మవారు ప్రత్యక్షమై తన చేతుల్తో కలిపి పెట్టినంత మధురంగా ఉండాలి. ‘సందేహం జనయతి సుధాయామతిరసః’ అది తింటే అమృతం కలిసిన అతిరసమా అని సందేహం కలగాలంటాడు పాకశాస్త్ర గ్రంథం క్షేమ కుతూహలంలో క్షేమశర్మ పండితుడు
ఒక చిన్న కథ చెప్పనా సరదాగా ... ఇవాళ, నిజంగా జరిగిందే! కబుర్ల కోసం చెపుతాను. పొద్దున్నే, వంటింట్లోని అల్మారాలో కందిపప్పు కోసం, డబ్బాలో పోద్దామని, వెదుకుతూ వుంటే, ఆర్నెల్ల కిందట కొన్న ఒక గారెల పౌడరు ప్యాకెట్ దొరికింది.
వానాకాలపు సొగసును, ముసురుబడిన గగనాన్ని, రైతుల సహజ జీవనాన్ని రాజకవి రాయలవారు ఆముక్తమాల్యదలో ఇలా వర్ణించారు. గురుగు, చెంచలి, తుమ్మి, తమిరిశ, చింతచిగురుతో కూడిన ఐదాకుల కూర గురించి ఇందులో చెప్పారు.
1899 నాటి ‘తెలుగునాడు’ గ్రంథంలో మహాకవి దాసు శ్రీరాములు పద్యం ఇది. ఉడికీ ఉడకని మెతుకులు, అది పప్పో లేక నీళ్లో తేడా తెలియనట్టుగా నీళ్లోడుతున్న పప్పు, కాగి కాగని చారు (రసం), గరిటె నంటుకుని విదిల్చినా జారకుండా గట్టిగా ఉండే ‘కట్టావి పులుసుకూర’ని వడ్డించిందట.
1904లో హిందూ సుందరి పత్రికా సంపాదకులు సత్తిరాజు సీతారామయ్య గారు వంటలక్క అనే పుస్తకంలో ‘సుర్మాలాడూ’ అనే వంటకాన్ని వివరించారు. ఇది చూర్మాలడ్డూ అనే గుజరాతీ వంటకానికి తెలుగు రూపం కావచ్చు.
‘సలాడ్’ అనే లాటిన్ పదంలో ‘సాల్’అంటే ఉప్పు. వండకుండా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని ఉప్పు, వెన్నతో కలిపి తినటాన్ని వాళ్లు ‘సలాడ్’ అనీ, మనవాళ్లు ‘హరితం’ లేదా ‘హరితకం’ అనీ అన్నారు.