Totakura Oats Cutlet Recipe: డైట్‌లో ఉన్నారా? ఈ హెల్తీ & టేస్టీ కట్‌లెట్ అస్సలు మిస్సవకండి
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:41 AM
మీరు డైట్‌లో ఉన్నారా? అయితే, ఈ హెల్తీ & టేస్టీ కట్‌లెట్ రెసిపీ మీ కోసం.. దీనిని అస్సలు మిస్సవకండి..
ఇంటర్నెట్ డెస్క్: హెల్తీ & టేస్టీ స్నాక్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే, మీరు ఎప్పుడైన తోటకూర ఓట్స్ కట్‌లెట్ తిన్నారా? ఇవి రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అంతేకాకుండా వీటిని ఇంట్లో చాలా ఈజీగా చేయవచ్చు. తోటకూర ఓట్స్ కట్‌లెట్‌కు కావాల్సిన పదార్థాలు, వాటి తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
తోటకూర- రెండు కట్టలు
ఓట్స్- ఒక కప్పు
పచ్చి మిర్చి- మూడు
అల్లం ముక్కలు- నాలుగు
ఉప్పు- రెండు చెంచాలు
ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు
గరం మసాల పొడి- ఒక చెంచా
బియ్యం పిండి- రెండు చెంచాలు
పెరుగు- పావు కప్పు, నూనె- తగినంత
తయారీ విధానం
తోటకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఒక చెంచా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. స్టవ్ మీద పాన్ పెట్టి, ఓట్స్ వేసి, దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి.
వెడల్పాటి గిన్నెలో వేయించిన ఓట్స్, ఉల్లిపాయ ముక్కలు, తోటకూర తరుగు, పచ్చిమిర్చి- అల్లం పేస్టు, ఒక చెంచా ఉప్పు, గరం మసాల పొడి, బియ్యం పిండి, పెరుగు వేసి బాగా కలపాలి.
అవసరమైతే కొన్ని నీళ్ల చుక్కలు చిలకరించుకుంటూ మెత్తని ముద్దలా చేయాలి. అరచేతికి నూనె రాసుకొని ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న కట్‌లెట్‌ల మాదిరి చేయాలి.
స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నాలుగు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఆపైన కట్‌లెట్‌లు పరిచి, చిన్న మంట మీద రెండు వైపులా దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. ఈ తోటకూర కట్‌లెట్‌లను టమాటా కెచప్, గ్రీన్ చట్నీ లేదా రైతాతో తింటే రుచిగా ఉంటాయి.
Also Read:
సూపర్ టేస్టీ తోటకూర లివర్ ఫ్రై .. ఒక్కసారి ట్రై చేయండి!
దసరాకు 101 వంటకాలతో భోజనం.. చిన్న పొరపాటు జరగడంతో కొత్త అల్లుడికి తులం బంగారం
For More Latest News