Home » Uttarakhand
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వరదలు సంభవించాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు, దుకాణాలు సహా పలు ఆలయాలు కూడా నీట మునిగాయి.
ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరుణుడు ప్రకోపించాడు. రాత్రి నుంచి కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా చమోలి జిల్లాలో ఇళ్లు, భవనాలు ధ్వంసం అయ్యాయి. ఒకరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు.
ఉత్తరాఖండ్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తన చెంప చెళ్లుమనిపించిన టీచర్‌పై ఓ విద్యార్థి తుపాకీతో కాల్పులు జరిపాడు. టీచర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
ఓ యువకుడు రీల్స్ చేయడం కోసం నది వద్దకు వెళ్లాడు. అక్కడ వరద నీరు పైనుంచి భారీ స్థాయిలో కిందకు దూకుతుంటుంది. ఈ క్రమంలో అతను వరద నీటిలోకి దిగి కెమెరాకు ఫోజులు ఇచ్చాడు. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
పంద్రాగస్టు రోజున అడవిలో సంచరిస్తున్న వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ రాకేష్ భట్‌కు ఓ అరుదైన దృశ్యం కనిపించింది. మన జాతీయ జంతువు,, జాతీయ పక్షి రెండూ కలిసి ఒకే దారిలో ఒకదాని వెనుక మరొకటి నడుస్తూ కనిపించాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఇది అరుదైన దృశ్యం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జవాది పోలీస్ స్టేషన్ దాటి ముందుకు వెళ్లరాదని యాత్రికులను జిల్లా పోలీసులు కోరారు. సోన్‌ప్రయోగ్‌కు ఇప్పటికే చేరుకున్న వారిని అక్కడనే ఉండాల్సిందిగా కోరారు. ఆంక్షల అమల్లో భాగంగా సోన్‌ప్రయాగ్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మంగళవారం కుండపోత వర్షం కారణంగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. బిహార్‌లో వరదలు పోటెత్తి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎమ్‌డీ హెచ్చరించింది.
ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే గ్రామం ధరాలి.. ఒక్కసారిగా వరద, బురదలో కొట్టుకుపోయింది. యాపిల్స్‌కు ప్రసిద్ధిచెందిన హర్షిల్ లోయ సమీపంలో ఉందీ గ్రామం. గంగోత్రి ధామాన్ని దర్శించేవాళ్ల కాసేపు విడిది కోసం మార్గమధ్యలో ఉన్న గ్రామానికి వస్తుంటారు. సమీపంలో భాగీరథీ నది ప్రవహిస్తోంది..
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ధరాలీ గ్రామాన్ని జలప్రళయం ముంచెత్తింది! మంగళవారం మధ్యాహ్నం
ఇప్పుడే అందుతోన్న మరో ఘోరమైన వార్త ఏంటంటే, ఉత్తరాఖండ్ మెరుపు వరదల తాకిడికి ఆర్మీ క్యాంప్ కొట్టుకు పోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా 11 మంది సైనికులు గల్లంతయినట్టు సమాచారం. వీరికోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతోంది.