Uttarakhand Himachal Rains: ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వర్ష బీభత్సం..18 మంది మృతి, వందలాది మంది గల్లంతు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:31 AM
సహజసిద్ధంగా అందంతో మెరిసే కొండ ప్రాంతాలు, ఇప్పుడు వర్షాల విలయంలో చిక్కుకున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వర్షాల కారణంగా అక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు (Uttarakhand Himachal Rains) బీభత్సం సృష్టించాయి. ఈ మాన్సూన్ సీజన్‌లో కుండపోత వర్షాలు, క్లౌడ్‌బరస్ట్‌లు ఈ రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఇప్పటివరకు వర్షాల కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గల్లంతయ్యారు. రోడ్లు, బస్ స్టాండ్‌లు, ఇళ్లు, ఆలయాలు వరదాల కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
ఉత్తరాఖండ్‌లో ఏం జరిగింది?
ఈ క్రమంలో కేవలం ఉత్తరాఖండ్‌లోనే క్లౌడ్‌బరస్ట్‌లు, భారీ వర్షాలతో 15 మంది ప్రాణాలు తీశాయి. 16 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. 900 మందికి పైగా ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ క్రమంలో డెహ్రాడూన్ ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది. తమ్సా నదిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిది మంది ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తుండగా నీటిలో కొట్టుకుపోయారు.
రోడ్లు, వంతెనలు
తమ్సా నది ఉప్పొంగడంతో డెహ్రాడూన్‌లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ ఆలయం జలమయమైంది. ఆలయంలోని భారీ హనుమాన్ విగ్రహం భుజాల వరకు నీరు చేరింది. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో డెహ్రాడూన్‌లో చాలా ప్రాంతాలకు ప్రజా రవాణా నిలిచిపోయింది. SDRF, NDRF బృందాలు పనిచేస్తున్నాయి. దేవభూమి ఇన్‌స్టిట్యూట్‌లో చిక్కుకున్న 400 మంది విద్యార్థులను కాపాడారు. వరద నీటిలో చిక్కుకున్న వందలాది మందిని రక్షించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితి?
హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వర్షాలు, కొండచరియల వల్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. మండి జిల్లాలోని బ్రగ్తా గ్రామంలో కొండచరియు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు.. ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వర్షం వల్ల బస్ స్టాండ్ మునిగిపోయింది. వాహనాలు, షాపులు నీటిలో కూరుకుపోయాయి. కోట్ల రూపాయల నష్టం సంభవించింది.
ఇప్పటి వరకు
655 రోడ్లు, జాతీయ రహదారులు మూతపడ్డాయి. 1,250 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం కాగా, 160 నీటి సరఫరా రద్దైంది. రాజధానిలో 12 గంటల్లో 142 మి.మీ. వర్షం కురిసింది. దీంతో కొండచరియలు విరిగిపడి, వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. జూన్ 20 నుంచి ఇప్పటి వరకు హిమాచల్‌లో 417 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది గల్లంతయ్యారు, రూ. 4,504 కోట్ల నష్టం వాటిల్లింది. ఇది రాష్ట్రంలో ఇప్పటివరకూ జరిగిన అత్యంత దారుణ మాన్సూన్ సీజన్లలో ఒకటని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి