Share News

Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఐదుగురి గల్లంతు

ABN , Publish Date - Sep 18 , 2025 | 07:27 AM

బుధవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ కారణంగా ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా అతలాకుతలమైంది. వరద ముంచెత్తడంతో ఐదుగురు గల్లంతయ్యారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Uttarakhand Cloud Burst: ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఐదుగురి గల్లంతు
Chamoli cloudburst

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో బుధవారం రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో ఐదుగురు గల్లంతయ్యారు. భారీ వరద పోటెత్తడంతో ఐదు భవనాలు కుప్పకూలాయి. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వరదలో చిక్కుకున్న ఇద్దరిని ఇప్పటికే కాపాడారు. మిగతా వారిలో కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వాతావరణం అనుకూలించక సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని స్థానిక అధికారులు తెలిపారు. జిల్లాలో మళ్లీ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జిల్లాలో ఇప్పటికీ అనేక మంది తమ ఇళ్లల్లో చిక్కుకుపోయారని స్థానికులు చెబుతున్నారు (Chamoli cloudburst).


ఇటీవల డెహ్రాడూన్‌లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. పలు రోడ్లు, భవనాలు నీటి వరదకు కొట్టుకుపోయాయి. రెండు ప్రధాన వంతెనలు కూడా కుప్పకూలాయి. పలు రోడ్లు కోతకు గురవడంతో డెహ్రాడూన్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. కాగా, క్లౌడ్ బర్స్ట్ ముప్పు ఇంకా పొంచి ఉండటంతో రాష్ట్రం ప్రభుత్వం.. డెహ్రాడూన్, చంపావత్, ఉద్దమ్ సింగ్ నగర్ ప్రాంతాల్లో సెప్టెంబర్ 20 వరకూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం, కొండ చరియలు విరిగి పడే ముప్పు పొంచి ఉందని ప్రజలను హెచ్చరించింది.


ఇవి కూడా చదవండి

చాలా రాష్ట్రాల్లో సగం మందికిపైగా ఓటర్లు ఎస్‌ఐఆర్‌కు పత్రాలు ఇవ్వనవసరం లేదు

ఈవీఎంపై అభ్యర్థుల కలర్‌ ఫొటోలు

For More National News and Telugu News

Updated Date - Sep 18 , 2025 | 07:51 AM