Miss Rishikesh Pageant: అందాల పోటీ కోసం రిహార్సల్స్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్‌హెచ్ఎస్ఎస్
ABN , Publish Date - Oct 05 , 2025 | 06:52 PM
శుక్రవారం లయన్స్ క్లబ్‌లో మోడల్స్ ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇంతలో రాష్ట్రీయ హిందూ శక్తి సంఘథాన్ సభ్యులు అక్కడికి వచ్చారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ర్యాంప్ వాక్‌లు చేయటం ఏంటని మండిపడ్డారు. రిహార్సల్స్‌ను ఆపేశారు.
మిస్ రిషికేశ్ పేజెంట్ ప్రదర్శన కోసం రిహార్సల్స్ జరుగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ హిందూ శక్తి సంఘథాన్ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. మోడల్స్ వేసుకున్న దుస్తులు బాగోలేవంటూ రిహార్సల్స్‌ను అడ్డుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో త్వరలో మిస్ రిషికేశ్ పేజెంట్ పేరిట అందాల పోటీలు జరుగుతున్నాయి. శుక్రవారం లయన్స్ క్లబ్‌లో మోడల్స్ ర్యాంప్ వాక్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు.
ఇంతలో రాష్ట్రీయ హిందూ శక్తి సంఘథాన్ సభ్యులు అక్కడికి వచ్చారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ర్యాంప్ వాక్‌లు చేయటం ఏంటని మండిపడ్డారు. రిహార్సల్స్‌ను ఆపేశారు. రాష్ట్రీయ హిందూ శక్తి సంఘథాన్ ప్రెసిడెంట్ రాఘవేంద్ర భత్నగర్ మాట్లాడుతూ.. ‘మోడలింగ్ అయిపోయింది. ఇక మీరు ఇంటికి వెళ్లిపోవచ్చు’ అంటూ మోడల్స్‌ను అక్కడి నుంచి బలవంతంగా పంపించేశాడు.
‘మన సంప్రదాయాన్ని పాడు చేయవద్దు. ఇది మన కల్చర్ కాదు’ అంటూ వారిపై మండిపడ్డాడు. దీంతో ఓ మోడల్ తిరగబడింది. ‘ముందు ఇలాంటి బట్టలు షాపుల్లో అమ్మకుండా ఆపేయండి’ అని అంది. ఇందుకు అతడు ‘నువ్వు ఇంకేమీ చెప్పొద్దు. మా పని మమ్మల్ని చేయనివ్వు. మీరు మీ ఇళ్లలో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి’ అని అన్నాడు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పంకజ్ చాందనీ మోడల్స్‌కు మద్దతుగా నిలిచారు. ‘వాళ్లు మేజర్లు. వాళ్లకు ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకుంటారు’ అని అన్నాడు. రెండు గ్రూపులకు కొంతసేపు వాగ్వివాదం నడిచింది. మొత్తానికి రిహార్సల్స్ అర్థాంతరంగా ఆగిపోయాయి.
ఇవి కూడా చదవండి
మనిషి రూపంలో ఉన్న మృగం.. కుక్కపిల్లల్ని అతి క్రూరంగా..
మీకు తెలియకుండా మీ పేరుతో లోన్ తీసుకున్నారా.. ఇలా ఈజీగా తెలుసుకోండి