CCTV Footage Goes Viral: మనిషి రూపంలో ఉన్న మృగం.. కుక్కపిల్లల్ని అతి క్రూరంగా..
ABN , Publish Date - Oct 05 , 2025 | 06:31 PM
ఓ వ్యక్తి చిన్నచిన్న కుక్క పిల్లల్ని దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. కుక్క పిల్లల కారణంగా నిద్ర పాడైందని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
మనుషుల్లో మానవత్వం రోజురోజుకు తగ్గుతూపోతోంది. ఓ మనిషి మీద మరో మనిషికి జాలి, దయ ఉండటం లేదు. తోటి మనుషులపైనే కాదు.. మూగ జీవాలపైనా కరుణ లేకుండా పోతోంది. మనుషుల రూపంలో ఉండే కొంతమంది మృగాళ్లు మనసు కలిచి వేసే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ వ్యక్తి చిన్న చిన్న కుక్క పిల్లల్ని దారుణంగా కర్రతో కొట్టి చంపేశాడు. కుక్క పిల్లల కారణంగా నిద్ర పాడైందని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ జాగ్రతి నగర్‌కు చెందిన గుత్తల్ చక్రబర్తి శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 1.30 గంటల ప్రాంతంలో ఇంటి బయట రెండు కుక్క పిల్లలు మెురుగుతూ ఉన్నాయి. వాటి కారణంగా అతడి నిద్ర భంగం అయింది. దీంతో చక్రబర్తికి కోపం వచ్చింది. కర్ర తీసుకుని ఇంటికి బయటకు వచ్చాడు. కుక్క పిల్లలపై దాడి చేశాడు.
విచక్షణా రహితంగా వాటిని కొట్టి చంపేశాడు. ఈ దృశ్యాలు ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఫుటేజీల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన జంతు ప్రేమికులు పెద్ద సంఖ్యలో స్పందించారు. గోహల్‌పూర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. చక్రబర్తిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హీరోయిన్లతో సెల్ఫీ దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్..
13 మంది మృతి.. వైన్ షాపు ధ్వంసం చేసిన మహిళలు.. లక్షల సొమ్ము నేలపాలు..