Women Vandalize Liquor Shop: 13 మంది మృతి.. వైన్ షాపు ధ్వంసం చేసిన మహిళలు.. లక్షల సొమ్ము నేలపాలు..
ABN , Publish Date - Oct 05 , 2025 | 03:35 PM
మహిళలు లిక్కర్ షాపులోకి చొరబడి లోపల ఉన్న మద్యం కేసులను తీసుకొచ్చి బయట పడేశారు. షాపు మొత్తం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు షాపు దగ్గరకు చేరుకున్నారు. అతి కష్టం మీద మహిళలకు సర్దిచెప్పారు.
కొంతమంది మహిళలు లిక్కర్ షాపుపై దాడికి పాల్పడ్డారు. షాపు మొత్తం ధ్వంసం చేసేశారు. లక్షలు విలువ చేసే సరుకును నేలపాలు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రాలోని ఖేరాఘర్‌లో కొన్నిరోజుల క్రితం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దుర్గామాతను ఉత్తంగ్ నదిలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో కుసియాపూర్‌కు చెందిన 13మంది నీటిలో మునిగిపోయి చనిపోయారు. దీంతో సంఘటన జరిగిన గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది ఇలా ఉండగా కుసియాపూర్ గ్రామ శివార్లలో ఉన్న లిక్కర్ షాపును నిన్న రీఓపెన్ చేశారు నిర్వాహకులు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. పెద్ద సంఖ్యలో లిక్కర్ షాపు దగ్గరకు చేరుకున్నారు. ‘13 మంది చనిపోయి వారం కూడా కాలేదు.
అప్పుడే షాపు ఓపెన్ చేస్తావా?’ అంటూ మండిపడ్డారు. షాపులోకి చొరబడి లోపల ఉన్న లిక్కర్ కేసులను తీసుకొచ్చి బయట పడేశారు. షాపు మొత్తం ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మద్యం దుకాణం దగ్గరకు చేరుకున్నారు. అతి కష్టం మీద మహిళలకు సర్దిచెప్పారు. శాంతించిన మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుప్పలు తెప్పలుగా లిక్కర్ బాటిళ్ల కేసులు రోడ్డుపై పడున్న దృశ్యాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
భారత్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్..మ్యాచ్ గెలిచేనా
దగ్గు మందుతో చిన్నారుల మృతి.. మధ్యప్రదేశ్ వైద్యుడి అరెస్టు