MP Doctor Arrest: దగ్గు మందుతో చిన్నారుల మృతి.. మధ్యప్రదేశ్ వైద్యుడి అరెస్టు
ABN , Publish Date - Oct 05 , 2025 | 03:18 PM
మధ్యప్రదేశ్‌లో దగ్గుమందు తాగి చిన్నారులు మృతి చెందిన కేసులో పోలీసులు తాజాగా ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 10 మంది చిన్నారులు మరణించిన కేసులో పోలీసులు ఓ డాక్టర్‌ను అరెస్టు చేశారు. చిన్నారులకు ఈ కాఫ్ సిరప్‌ను సూచించినందుకు డా.ప్రవీణ్ సోనీని అదుపులోకి తీసుకున్నారు (Coldriff deaths, MP Doc Arrested).
అంతకుముందు పోలీసులు, డా.సోనీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిరప్‌ను తయారు చేసిన శ్రీసన్ ఫార్మాసిటుకల్స్ ఆపరేటర్లపై కూడా కేసు పెట్టారు. బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. చిన్నారులకు డా. సోనీ కోల్డ్రిఫ్ దగ్గు మందును సూచించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఆ సిరప్‌లో డైఇథిలిన్ గ్లైకాల్ (డీఈజీ) అనే విషపూరిత రసాయనం ఉన్నట్టు ల్యాబ్ రిపోర్టుల్లో వెల్లడైంది. డీఈజీతో కిడ్నీలు చెడిపోయి మరణం సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు (toxic cough syrup case).
ఇక దగ్గు మందుతో మరణాల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. చిన్నారులకు కాఫ్ సిరప్‌లు సూచించే విషయంలో అప్రమత్తత పాటించాలని తెలిపింది.
కాఫ్ సిరప్ విషయంలో పలు రాష్ట్రాల కూడా అప్రమత్తమయ్యాయి. చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ ఔషధాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం శనివారం నిషేధం విధించింది. ఇక కాంచీపురం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీసన్ ఫార్మాసిటుకల్స్‌పై అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్త్వం మధ్యప్రదేశ్ తరహా నిషేధాన్ని ప్రకటించింది. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రం కూడా కోల్డ్రిఫ్‌ను నిషేధించింది. ఈ దగ్గుమందు విక్రయాలు చేయొద్దని ఆదేశించింది. కులుషితమైన కోల్డ్రిఫ్ దగ్గుమందు బ్యాచ్ తమ రాష్ట్రంలో లేకపోయినా ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
కరూర్ తొక్కిసలాట ఒక కుట్ర: ఖుష్బూ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి