India vs Pakistan ICC Women World Cup 2025: భారత్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. మ్యాచ్ గెలిచేనా
ABN , Publish Date - Oct 05 , 2025 | 03:19 PM
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా కొలంబోలో భారత్, పాకిస్తాన్ మధ్య నేడు ఆరో మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్-2025 (ICC Women World Cup 2025) ఆరో మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మహిళా జట్లు కొలంబోలో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుని భారత బ్యాటింగ్‌ను సవాలు చేయాలని భావించింది. రెండు జట్లూ తమ ఆటతీరుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో చూడాలి మరి. ఈ మ్యాచులో టాస్ వేసిన క్రమంలో పాకిస్తాన్ గెలువగా.. భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమెతో కరచాలనం చేయకుండా వెళ్లారు.
ఈ మ్యాచ్ కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ప్రేమదాస స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బ్యాట్స్‌మెన్లకు ఇబ్బందులను సృష్టిస్తుంది. వర్షం వల్ల తేమ బౌలర్లకు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది. దీంతో ఈరోజు మ్యాచులో తక్కువ స్కోరింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది.
పాయింట్ల పట్టికలో రెండు జట్ల స్థానాలకు సంబంధించి హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది, కానీ భారత జట్టు నికర రన్ రేట్ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉంది. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఫాతిమా సనా కెప్టెన్‌గా ఉన్న పాకిస్తాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈరోజు టీమ్ ఇండియా గెలిస్తే, నంబర్ వన్ స్థానానికి చేరుతుంది.
పాకిస్తాన్ జట్టు ప్లేయింగ్ 11: మునీబా అలీ, సదాఫ్ షమాస్, సిద్రా అమీన్, రమీన్ షమీ, అలియా రియాజ్, సిద్రా నవాజ్ (వికెట్ కీపర్), ఫాతిమా సనా (కెప్టెన్), నటాలియా పర్వైజ్, డయానా బేగ్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.
భారత జట్టు ప్లేయింగ్ 11: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి. ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి మ్యాచ్‌లో కీలక అర్ధశతకం బాదిన ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ తప్పుకుంది. ఆమె స్థానంలో రేణుకా ఠాకూర్‌ని తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి