Shashi Tharoor Meets Actresses: హీరోయిన్లతో సెల్ఫీ దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్..
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:10 PM
తమిళ స్పోర్ట్స్ డ్రామా బైసన్ అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమ, రజిష ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ మలయాళ హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, రజిష వియన్‌తో సెల్ఫీలు దిగారు. ఓ విమాన ప్రయాణంలో అనుకోకుండా ఈ ముగ్గురూ కలిశారు. ఆదివారం ఉదయం చెన్నై వైపు వెళుతున్న విమానంలో శశి థరూర్ పక్క సీట్లలో హీరోయిన్లు కూర్చున్నారు. వారిని శశి థరూర్ పలకరించారు. తర్వాత సీటు దగ్గరే సెల్ఫీలు తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం వాటిని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
‘చెన్నై వెళుతున్న విమానంలో మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, రజిష విజయన్‌ను చూశాను. వారితో కలిసే ట్రావెల్ చేశాను. వారు నటించిన ‘బైసన్’ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ‘నిజమైన సూపర్ స్టార్ మీరే. మీ అంచులకు కూడా ఎవ్వరూ రాలేరు’..
‘సార్ నాకు తెలీక అడుగుతున్నా. మీరు ప్రతీసారి సరైన సమయంలో.. సరైన ప్రదేశంలో ఎలా ఉంటున్నారు’.. ‘మీరు చాలా లక్కీ సార్.. మీరు ట్రావెల్ చేసే ప్రతీసారీ లేడీ ప్యాసెంజర్స్ మీ పక్క సీట్లలో ఉంటున్నారు’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, తమిళ స్పోర్ట్స్ డ్రామా బైసన్ అక్టోబర్ 17వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో అనుపమ, రజిష ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఇవి కూడా చదవండి
వైన్ షాపు ధ్వంసం చేసిన మహిళలు.. లక్షల సొమ్ము నేలపాలు..
బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ పాడుపని.. యువతితో అసభ్య ప్రవర్తన..