Blinkit Delivery Driver: బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ పాడుపని.. యువతితో అసభ్య ప్రవర్తన..
ABN , Publish Date - Oct 05 , 2025 | 02:56 PM
బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకాడు. అక్టోబర్ 3వ తేదీన రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది.
సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. కొంతమంది కామాంధుల కారణంగా ఆడవారు తరచుగా ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా, బ్లిన్‌కిట్ డెలివరీ బాయ్ ఓ యువతితో తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకరాని చోట తాకాడు. అక్టోబర్ 3వ తేదీన రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు ఇందుకు సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆ పోస్టులో.. 'బ్లిన్‌కిట్ నుంచి ఆర్డర్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు నాకు ఇలా జరిగింది. ఆ డెలివరీ బాయ్ నా అడ్రస్ గురించి మరోసారి అడిగాడు. నన్ను తప్పుగా తాకాడు. ఇది మంచి పద్దతి కాదు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోండి. భారతదేశంలో ఆడవారి భద్రత ఓ జోకా’ అని ప్రశ్నించింది. ఆ పోస్టులో సంఘటనకు సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియో కూడా ఉంది. ఈ ఘటనపై బ్లిన్‌కిట్ కంపెనీ స్పందించింది.
బాధితురాలితో ఫోన్ ద్వారా చర్చించింది. అనంతరం ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో.. ‘జరిగిన దానికి నిజంగా క్షమాపణలు చెబుతున్నాం. మీరెంత వేదనకు గురై ఉంటారో అర్థం చేసుకోగలం. మనం చర్చించిన విధంగా తప్పకుండా నిందితుడిపై చర్యలు ఉంటాయి. ఎలాంటి సమాచారం, మద్దతు కోసమైనా ఇబ్బందిపడకుండా మాతో చాట్ చేయండి’ అని పేర్కొంది. ముంబై పోలీసులు కూడా ఈ సంఘటనపై స్పందించారు. బాధితురాలికి మెసేజ్ చేశారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి
డార్జిలింగ్‌లో కొండచరియల బీభత్సం.. 17 మందికి చేరిన మృతులు
అక్టోబర్ 6 నుంచి మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే..ఈసారి ఎన్ని వస్తున్నాయంటే