Upcoming IPOs: అక్టోబర్ 6 నుంచి మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే..ఈసారి ఎన్ని వస్తున్నాయంటే
ABN , Publish Date - Oct 05 , 2025 | 02:44 PM
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మళ్ళీ కొత్త వారం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందుకు ఐదు పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. ఈ సారి టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా సహా పలు కంపెనీల బ్రాండ్లు ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ వచ్చేసింది. అక్టోబర్ 6 నుంచి ప్రారంభమయ్యే వారంలో ఇన్వెస్టర్లు ఐదు కొత్త పబ్లిక్ ఇష్యూలలో ఇన్వెస్ట్ చేసేందుకు ఛాన్సుంది. ఈ వారం ప్రారంభమయ్యే IPOలలో టాటా క్యాపిటల్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ఉన్నాయి. వీటి కోసం ఇన్వెస్టర్లు అనేక రోజులుగా వేచి చూస్తున్నారు. దీంతోపాటు WeWork India IPOతో సహా ఇప్పటికే మొదలైన నాలుగు పబ్లిక్ ఇష్యూలలో (Upcoming IPOs) కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొత్త IPOల ప్రారంభం
టాటా క్యాపిటల్ IPO: రూ. 15,511.87 కోట్ల విలువైన ఈ ఇష్యూ అక్టోబర్ 6న ప్రారంభమై, అక్టోబర్ 8న ముగుస్తుంది. దీని బిడ్డింగ్ ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.310-326, లాట్ సైజు 46 షేర్లు. అక్టోబర్ 13న BSE, NSEలలో షేర్లు లిస్ట్ అవుతాయి.
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా IPO: కంపెనీ రూ.11,607.01 కోట్ల విలువైన పబ్లిక్ ఇష్యూను ప్రారంభిస్తోంది. ఇది అక్టోబర్ 7న ప్రారంభమై, అక్టోబర్ 9న ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ. 1,080- రూ. 1,140 ధరల పరిధిలో పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి. లాట్ సైజు 13 షేర్లు. ఈ కంపెనీ అక్టోబర్ 14న BSE NSEలలో లిస్ట్ కానుంది.
అనంతం హైవేస్ ట్రస్ట్ ఇన్విట్ IPO: ఇది అక్టోబర్ 7న ప్రారంభమై, అక్టోబర్ 9న ముగుస్తుంది. రూ.400 కోట్లు సేకరించడమే ఈ కంపెనీ లక్ష్యం. దీని ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 98-100. IPO ముగిసిన తర్వాత అక్టోబర్ 17న BSE, NSEలలో లిస్ట్ అవుతుంది.
మిట్టల్ సెక్షన్స్ IPO: ఇది అక్టోబర్ 7న ప్రారంభమవుతుంది. ఇష్యూ పరిమాణం రూ. 52.91 కోట్లు. అక్టోబర్ 9 వరకు ఒక్కో షేరుకు రూ.136-143 ధరతో 1,000 షేర్లతో బిడ్లను సమర్పించవచ్చు. అక్టోబర్ 14న ఈ షేర్లు BSE SMEలో లిస్ట్ అవుతాయి.
రూబికాన్ రీసెర్చ్ IPO: దీని విలువ రూ. 1,377.50 కోట్లు. ఇది అక్టోబర్ 9న ప్రారంభమై, అక్టోబర్ 13న ముగుస్తుంది. దీని షేర్లు అక్టోబర్ 16న BSE, NSEలలో లిస్ట్ చేయబడతాయి. దీని బిడ్డింగ్ ధర ఒక్కో షేరుకు రూ. 461-485. లాట్ సైజు 30 షేర్లు.
ఇప్పటికే మొదలైన ఐపీఓలు
DSM ఫ్రెష్ ఫుడ్స్ IPO: రూ. 59.06 కోట్ల విలువైన ఈ ఇష్యూ సెప్టెంబర్ 26న ప్రారంభమై, అక్టోబర్ 6న ముగుస్తుంది. ఒక్కో షేరుకు రూ. 95-100. లాట్ సైజు 1,200 షేర్లు.
గ్రీన్‌లీఫ్ ఎన్విరోటెక్ IPO: రూ. 21.90 కోట్ల విలువైన ఈ ఇష్యూ సెప్టెంబర్ 30న ప్రారంభమై, అక్టోబర్ 6న ముగుస్తుంది. దీని ధర ఒక్కో షేరుకు రూ.136. లాట్ సైజు 1,000 షేర్లు. ఈ కంపెనీ అక్టోబర్ 9న NSE SMEలో లిస్ట్ కానుంది.
శ్లోక్కా డైస్ IPO: ఇది కూడా సెప్టెంబర్ 30న ప్రారంభమైంది. అక్టోబర్ 6న ముగుస్తుంది. రూ.63.50 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.95-100. లాట్ సైజు 1,200 షేర్లు.
వీవర్క్ ఇండియా మేనేజ్‌మెంట్ IPO: మెయిన్‌బోర్డ్ విభాగంలో అక్టోబర్ 3న ఇష్యూ ప్రారంభమైంది. కంపెనీ రూ.3,000 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని బిడ్డింగ్ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.615-648. లాట్ సైజు 23 షేర్లు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి