Home » Union Budget
పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో మధ్యతరగతి జీవులకు ఏమైనా ఉపశమనం ఉంటుందేమో.. ఆదాయ పన్నులకు సంబంధించిన ఉపశమన ప్రకటనలు ఏమైనా ఉంటాయేమోనని అంతా భావించారు. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ కేంద్రం సాహసోపేతంగా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమోనన్న చిన్న అనుమానాలు కలిగాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని, నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.
2024 సంవత్సరానికిగానూ మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి చదివి వినిపిస్తున్నారు.
Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆర్థిక మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించిందని చెప్పారు.
Union Budget 2024: ఇవాళ పార్లమెంట్‌లో మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ బడ్జెట్‌లో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారా? అని ఆశగా చూస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకొని.. సామాన్య ప్రజలందరి వరకు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నారు.
పార్లమెంటు సమావేశాలు అనగానే సాధారణంగా గుర్తొచ్చే పదం బడ్జెట్. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంతో కట్టాల్సిన అప్పులేంటి, అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాలి, పథకాలకు కేటాయింపులెలా తదితర అంశాలను బడ్జెట్‌లో పొందుపరుస్తారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం మొదలయ్యాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె కీలక ప్రసంగం ఇచ్చారు. ఈ సందర్భంగా గత కొన్నేళ్లలో దేశం సాధించిన పలు విజయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. విజయాలకు సంబంధించి ప్రభుత్వం చూపిన చొరవను ఆమె ప్రశంసించారు.
మధ్యంతర బడ్జెట్-2024-25ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతన పార్లమెంట్ భవనంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె మాట్లాడారు.
పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించడం ఖాయమని కేంద్ర ఫైనాన్స్ మినిస్ట్రీ లెక్కగట్టింది. అయితే వచ్చే ఏడాది అంచనాల మేరకు ఆర్థిక ప్రగతికి పలు సవాళ్లు పొంచివున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు వీ నాగేశ్వరన్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితుల్లో మధ్యతరగతి జీవులు బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే రెండు దశాబ్దాల్లో ‘వీక్షిత్ (అభివృద్ధి) భారత్’ అవతరించడమే లక్ష్యంగా ధరల నియంత్రణ, వ్యవసాయానికి సబ్సిడీలు కొనసాగింపు, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణం దిశగా ప్రకటనలు ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.