Share News

Budget 2024: ఆదాయ పన్ను విధానాల్లో మార్పులేదు.. కానీ 1 కోటి మందికి ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయం ప్రకటించిన సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2024 | 05:26 PM

పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో మధ్యతరగతి జీవులకు ఏమైనా ఉపశమనం ఉంటుందేమో.. ఆదాయ పన్నులకు సంబంధించిన ఉపశమన ప్రకటనలు ఏమైనా ఉంటాయేమోనని అంతా భావించారు. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ కేంద్రం సాహసోపేతంగా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమోనన్న చిన్న అనుమానాలు కలిగాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి.

Budget 2024: ఆదాయ పన్ను విధానాల్లో మార్పులేదు.. కానీ 1 కోటి మందికి ప్రయోజనం చేకూర్చే కీలక నిర్ణయం ప్రకటించిన సీతారామన్

పార్లమెంట్ ఎన్నికల ముందు చివరి బడ్జెట్ కావడంతో మధ్యతరగతి జీవులకు ఏమైనా ఉపశమనం ఉంటుందేమో.. ఆదాయ పన్నులకు సంబంధించిన ఉపశమన ప్రకటనలు ఏమైనా ఉంటాయేమోనని అంతా భావించారు. మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ కేంద్రం సాహసోపేతంగా ఏవైనా ప్రకటనలు చేస్తుందేమోనన్న చిన్న అనుమానాలు కలిగాయి. కానీ అవన్నీ పటాపంచలయ్యాయి. ఈ ఏడాది పన్ను విధానంలో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పన్ను స్లాబ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చారు. దిగుమతి సుంకాలతో సహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదని చెప్పారు. రీఫండ్‌ సగటు సమయం 2013-2014లో 93 రోజులు ఉండగా గతేడాది బడ్జెట్‌లో కేవలం 10 రోజులకు తగ్గించామని ఆమె ప్రస్తావించారు. అయితే ఒక కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగించేలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.

ఆర్థిక సంవత్సరం 2009-10కి సంబంధించిన వివాదాస్పద రూ.25 వేల ట్యాక్స్ డిమాండ్, 2010-11 నుంచి 2014-15 మధ్య రూ.10 వేలకు సంబంధించిన ట్యాక్స్ డిమాండ్ ఉపసంహరణకు ప్రతిపాదన చేస్తున్నట్టు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR).. ఆదాయ పన్ను అధికారి చేసిన మదింపునకు విరుద్ధంగా ఉంటే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను డిమాండ్ నోటీసు జారీ చేస్తారు. పైన పేర్కొన్న ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి చెల్లింపుదారులకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం దాదాపు 1 కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.

Updated Date - Feb 01 , 2024 | 05:26 PM