Share News

Budget 2024 Live Updates: రికార్డ్ బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్!

ABN , First Publish Date - Feb 01 , 2024 | 09:04 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ 2024-25ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు. రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని, నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసింది.

Budget 2024 Live Updates: రికార్డ్ బ్రేక్ చేసిన నిర్మలా సీతారామన్!

Live News & Update

  • 2024-02-01T15:00:44+05:30

    తెలుగు రాష్ట్రాల గురించి రైల్వే మంత్రి ఏమన్నారంటే..?

    • 2009 నుంచి 2014 వరకు 886 కోట్లు కేటాయించారు : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్

    • ప్రస్తుత బడ్జెట్ లో రూ. 9138 కోట్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించారు

    • ఇది 10 శాతం రెట్టింపు

    • ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నాయి

    • 98 శాతం ఆంధ్రప్రదేశ్‌లో విద్యుద్దీకరణ పూర్తి అయింది

    • ప్రస్తుత బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వే అభివృద్ధి కోసం రూ. 5071 కోట్లు కేటాయింపు జరిగింది

    • 850 శాతం వృద్ధి ఉంది..

    • 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయింది

    • ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేశారు

    • ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి.

    ashwini-vaishnaw.jpg

    భూమి ఇవ్వలే!!

    • విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాము

    • ఇంకా ఏపీ ప్రభుత్వం నుంచి భూమి అప్పగించలేదు

    • రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం

    • జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్ సిద్ధం అయ్యింది

    • ఏపీ లో 97 శాతం రైల్వే ట్రాక్స్ పూర్తి చేశాం

    • 72 అమృత్ స్టేషన్స్ పూర్తయ్యాయి..

  • 2024-02-01T14:45:15+05:30

    ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగింది

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు కీలక విషయాలు వెల్లడించారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తూ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావించారు. దేశ ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందన్నారు. గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చాయని చెప్పారు. దేశ ప్రజలు భవిష్యత్తు వైపు ఆశగా, ఆశావాదంతో చూస్తున్నారన్న ఆమె.. ప్రజల ఆశీర్వాదంతో 2014లో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ‘సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్’ మంత్రంతో దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని గుర్తు చేసుకున్నారు. ఆ సవాళ్లను సీరియస్‌గా తీసుకున్న మోదీ ప్రభుత్వం.. వాటిని సమర్థవంతంగా అధిగమించిందని వెల్లడించారు.

    ఇంకా ఏమన్నారంటే..?

    ‘మా ప్రభుత్వం సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందరికీ ఇల్లు, ఇంటింటికి నీరు, బ్యాంకు ఖాతా, ఆర్థిక సేవలు అందిస్తున్నాం. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాం. తద్వారా ఆహార సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాం. రైతులకు మద్దతు ధర పెంచాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేశాం. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాం. పేదలు, మహిళలు, యువత, రైతులపై ప్రత్యేక దృష్టి సారించాం. అందరినీ కలుపుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి కొనసాగుతోంది..’ అని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు.

  • 2024-02-01T14:15:00+05:30

    58 నిమిషాలు ప్రసంగించిన నిర్మలా సీతారామన్!

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) నరేంద్ర మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను (Union Budget) గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 58 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఇంతవరకూ ఆమె ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లతో పోల్చుకుంటే అత్యంత తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగించడం ఇదే ప్రథమం. ఒక రకంగా చెప్పుకుంటే.. మునుపటి ప్రసంగాలు, బడ్జెట్‌తో పోలిస్తే.. నిర్మలమ్మ బడ్జెట్ రికార్డ్ బ్రేక్ అని నిపుణులు చెబుతున్న పరిస్థితి.

    నిర్మలా సీతారామన్ గత ప్రసంగాలను పరిశీలిస్తే, 2019లో 137 నిమిషాల పాటు ఆమె బడ్జెట్ ప్రసంగం సాగించారు. 2020లో 162 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. 2021లో 110 నిమిషాలు, 2022లో 92 నిమిషాలు ప్రసంగించారు. 2023లో 87 నిమిషాల పాటు ఆమె ప్రసంగం సాగింది. ఈసారి (2024) తాత్కాలిక బడ్జెట్ కావడంతో 58 నిమిషాలతో ప్రసంగం ముగిసింది. 2019 జూలై నుంచి ఐదు సార్లు పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో గత ఆర్థిక మంత్రులు మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హాల రికార్డులను ఆమె అధిగమించారు.

  • 2024-02-01T13:22:02+05:30

    మధ్యంతర బడ్జెట్‌పై ప్రధాని మోదీ తొలి స్పందన ఇదే..

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించిన మధ్యంతర బడ్జెట్ 2024-25పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మధ్యంతర బడ్జెట్ సమగ్రమైనదని, వినూత్నమైనదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగుతుందనే విశ్వాసాన్ని కల్పిస్తోందని అన్నారు. విక్‌సిత్ భారతానికి 4 స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను ఈ మధ్యంతర బడ్జెట్ శక్తివంతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలపడానికి హామీ ఇస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు.

  • 2024-02-01T13:16:09+05:30

    ఈ బడ్జెట్ దేశాభివృద్ధిని వేగవంతం చేస్తుంది: నితిన్ గడ్కరీ

  • 2024-02-01T12:48:40+05:30

    • మెడికల్ కాలేజీల సంఖ్య పెంపు కోసం కమిటీ ఏర్పాటు

    • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లు 2024కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

  • 2024-02-01T12:37:30+05:30

    Untitled-7.jpg

    రూఫ్‌టాప్ ద్వారా కోటి ఇళ్లకు 300 యూనిట్ల విద్యుత్ ఫ్రీ

    రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా 1 కోటి ఇళ్లు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూఫ్‌టాప్ సోలారైజేషన్ ద్వారా రూ.15,000 - రూ.18,000 వరకు ఆదా అవుతుందని, మిగులు ఆదాయాన్ని డిస్కమ్‌లకు విక్రయించొచ్చని ఆమె ప్రకటించారు.

  • 2024-02-01T12:27:26+05:30

    • ఆర్థిక సంవత్సరం 2025 మొత్తం వ్యయం రూ. 47.66 లక్షల కోట్లుగా అంచనా.

    • రుణేతర ఆదాయం రూ.30.80 లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా.

    • నికర రుణాలు రూ. 11.75 లక్షల కోట్లుగా అంచనా.

    • ఆర్థిక సంవత్సరం 2025లో ఆర్థిక లోటు జీడీపీలో 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా.

    • ఆర్థిక సంవత్సరం2026 నాటికి ద్రవ్య లోటును 4.5 శాతం కంటే దిగువకు తగ్గించడమే లక్ష్యం.

  • 2024-02-01T12:16:19+05:30

    • వికసిత్ భారత్ కోసం జూలై 2024 బడ్జెట్‌లో ప్రభుత్వం వివరాలతో కూడిన ప్రణాళికను సమర్పించనుంది.

    • ఆర్థికాభివృద్ధిలో యావత్ దేశం క్రియాశీలకంగా ఉంది.

  • 2024-02-01T12:09:13+05:30

    • ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలు పెంపు

    • పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యక్రమం రూపొందిస్తాం.

  • 2024-02-01T12:06:24+05:30

    • మూడు ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్లకు సంబంధించిన కార్యక్రమాలను అమలు చేస్తాం.

    • దేశీయ పర్యాటక రంగానికి ఊతమివ్వడమే లక్ష్యంగా లక్షద్వీప్ సహా పలు దీవులను అభివృద్ధి చేస్తాం. ఇందుకోసం ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది.

    • డీప్ టెక్నాలజీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కొత్త స్కీమ్‌ను ప్రారంభిస్తాం.

  • 2024-02-01T12:02:19+05:30

    రైలు బోగీలన్నింటినీ వందేభారత్‌ ప్రమాణాలతో మార్పు చేస్తాం.

  • 2024-02-01T11:56:00+05:30

    పన్ను విధానాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదని ఆమె చెప్పారు.

  • 2024-02-01T11:54:17+05:30

    • ఎఫ్‌డీఐ 'ఫస్ట్ డెవలప్ ఇండియా' అని, 2014 నుంచి 2023 మధ్యకాలంలో 596 బిలియన్ యూఎస్ డాలర్లు ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి.

    • ఇది ఒక స్వర్ణ యుగానికి సంకేతం. 2005 నుంచి 2014 మధ్య ఎఫ్‌డీఐ ఇన్‌ఫ్లో‌తో పోల్చితే రెండింతల పెరుగుదల నమోదయ్యింది.

    • స్థిరమైన ఎఫ్‌డీఐల కోసం విదేశీ భాగస్వాములతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నాం.

  • 2024-02-01T11:49:52+05:30

    • సర్వతోముఖాభివృద్ధి దృక్పథంతో ప్రభుత్వం పని చేస్తోంది.

    • ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉంది. ద్రవ్యోల్బణం మితంగా ఉంది.

    • భవిష్యత్తు ఆకాంక్షలతో ప్రజలు గణనీయ ఆదాయాన్ని పొందుతున్నారు.

    • ఉన్నత విద్యలో మహిళల నమోదు పెరుగుతోంది.

    • 'సబ్‌కా ప్రయాస్' విధానం కరోనా మహమ్మారి సవాళ్లను విజయవంతంగా అధిగమించింది.

  • 2024-02-01T11:42:51+05:30

    నూతన గృహ నిర్మాణ విధానం అందుబాటులోకి తెస్తున్నాం: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలమ్మ

  • 2024-02-01T11:41:54+05:30

    • స్వయం సహాయక సంఘాల విజయంతో 1 కోటి మంది మహిళలు లక్షాధికారులుగా మారారు.

    • 9 కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు గ్రామీణ సామాజిక-ఆర్థిక పరిస్థితులను మార్చివేస్తున్నాయి.

  • 2024-02-01T11:36:45+05:30

    • వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు పంట నూర్పిడి తర్వాత కార్యకలాపాలలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తాం.

    • బీజేపీ ప్రభుత్వం అద్భుతమైన పని ఆధారంగా ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారు: నిర్మలా సీతారామన్

    Untitled-7.jpg

  • 2024-02-01T11:34:12+05:30

    • పీఎం కిసాన్ సంపద యోజన 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించింది.

    • వచ్చే ఐదేళ్లలో అసాధారణ అభివృద్ధిని సాధించబోతున్నాం.

    • 5 సమగ్ర అక్వా పార్కులను ఏర్పాటు చేస్తాం.

    • 2013-14 తర్వాత సముద్ర ఉత్పత్తల ఎగుమతి రెండింతలు పెరగింది.

    • అన్ని వాతావరణ జోన్లకు నానో డీఏపీ అందజేస్తాం.

  • 2024-02-01T11:31:27+05:30

    • పీఎం ఆవాస్ యోజన - గ్రామీణ పథకం కింద వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల గృహాలు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.

    • ఆర్థిక వ్యవస్థను పటిష్ఠంగా తయారు చేయడంలో డిజిటల్ ఇండియా చాలా ముఖ్యం.

    • ఆయుస్మాన్ భారత్ ప్రయోజనాలను ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపజేస్తాం.

  • 2024-02-01T11:26:47+05:30

    జీడీపీపై మా ప్రభుత్వం దృష్టిసారించింది: సీతారామన్

    GDP - పాలన(గవర్నెన్స్), అభివృద్ధి (డెవలప్‌మెంట్), పనితీరుపై(పెర్ఫార్మెన్స్) మా ప్రభుత్వం సమాన స్థాయిలో దృష్టి సారించింది.

    Untitled-6.jpg

  • 2024-02-01T11:23:14+05:30

    • ఆకాశమే హద్దుగా అవకాశాలను సృష్టించగల స్థితిలో భారత్ నిలిచింది.

    • అందరికీ అవకాశాలు కల్పించే సత్తా మన దేశానికి ఉంది.

  • 2024-02-01T11:21:26+05:30

    యుద్ధాలు, కరోనా మహమ్మారి పరిస్థితుల్లో ప్రపంచం కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్‌లో జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించాం: సీతారామన్

    Untitled-6.jpg

  • 2024-02-01T11:19:44+05:30

    • స్కిల్ ఇండియా మిషన్ 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చింది.

    • 54 లక్షల మంది నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు.

    • 3000 నూత ఐటీఐలను మా ప్రభుత్వం స్థాపించింది. పెద్ద

    • సంఖ్యలో సంస్థాగత ఉన్నత విద్య సంస్థలను నెలకొల్పాం.

    • 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఏఐఐఎంఎస్‌లు, 390 విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  • 2024-02-01T11:15:21+05:30

    సీతారామన్ ప్రసంగం

    • దేశంలోని యువతకు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి.

    • పేదలు, మహిళలు, యువత, రైతులపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వారి అవసరాలు, ఆకాంక్షలకు అధిక ప్రాధాన్యతలు ఇస్తున్నాం.

    • అద్భుతమైన పని ఆధారంగా మా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నాం.

  • 2024-02-01T10:59:41+05:30

    మధ్యంతర బడ్జెట్ 2024-25 లైవ్...

  • 2024-02-01T10:52:06+05:30

    బడ్జెట్‌ 2024-25కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.. మరికొన్ని నిమిషాల్లో సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టనున్నారు.

  • 2024-02-01T10:41:32+05:30

    మధ్యంతర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

    కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు కాంగ్రెస్ ఎంపీ కే.సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల ఆధారిత బడ్జెట్ అని తాము భావిస్తున్నామని అన్నారు. బీజేపీ మళ్లీ గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటోందని, అందుకే కొత్త జిమ్మిక్కులు చేస్తుందని అన్నారు. బడ్జెట్‌లో సామాన్యుల కోసం కంటితుడుపు పథకాలు ఉంటాయని పేర్కొన్నారు. సామాన్యుల గురించి మాట్లాడుతూనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నారని, మోదీ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు.

  • 2024-02-01T10:28:14+05:30

    పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ సమర్పణకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. సీతారామన్‌తో పాటు మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఉన్నారు.ఈ సందర్భంగా సీతారామన్‌కు రాష్ట్రపతి స్వీట్ తినిపించారు.

    Untitled-4.jpg

  • 2024-02-01T10:24:56+05:30

    మరికొద్ది సేపట్లోనే నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది.

  • 2024-02-01T10:19:21+05:30

    బడ్జెట్‌ సమర్పణకు ముందు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు..

  • 2024-02-01T10:17:51+05:30

    పార్లమెంట్‌కు చేరుకున్న మధ్యంతర బడ్జెట్ కాపీలు.

  • 2024-02-01T10:13:01+05:30

    బడ్జెట్ బుక్‌తో పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్. మధ్యంతర బడ్జెట్‌ సమర్పణకు ముందు పార్లమెంట్‌లో ప్రారంభమైన కేంద్ర మంత్రివర్గం సమావేశం.

  • 2024-02-01T10:02:25+05:30

    ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు.

  • 2024-02-01T10:01:37+05:30

    ఉద్యోగాలు, ఆదాయ పన్ను, మధ్యతరగతికి సంబంధించిన ప్రకటనలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కీలకమైన విధానపరమైన ప్రకటనలు, ఆదాయ పన్ను ఉపశమనం, నూతన సంక్షేమ పథకాలు ఉండకపోవచ్చుననే అంచనాలున్నాయి.

    Untitled-2.jpg

  • 2024-02-01T09:47:52+05:30

    బడ్జెట్ పద్దుతో ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యాలయం నుంచి బయలుదేరిన నిర్మలా సీతారామన్

  • 2024-02-01T09:44:50+05:30

    బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం 4 గంటల నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం

  • 2024-02-01T09:38:20+05:30

    11 గంటలకు పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వరుసగా 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జి దేశాయ్ సరసన ఆమె నిలవనున్నారు.

  • 2024-02-01T09:30:49+05:30

    నీలిరంగు చీరలో నిర్మలమ్మ

    బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో ఆర్థిక మంత్రుల వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు బడ్జెట్ సందర్భంగా కేంద్ర కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీలిరంగు చీర కట్టుకున్నారు. ఫొటో సెషన్‌లో రెడ్ కలర్‌లో ఉన్న ‘ఎరుపు బుక్'ని మీడియాకు చూపించారు. సహచర మంత్రులు, బడ్జెట్ రూపకల్పనలో ఉన్న పాల్గొన్న అధికారులు ఆమె వెంట ఉన్నారు.

    Untitled-8.jpg

  • 2024-02-01T09:09:32+05:30

    ఫైనాన్స్ మినిస్ట్రీ కార్యాలయానికి చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

    Untitled-7.jpg

  • 2024-02-01T09:05:20+05:30

    ఎనో ఆశలు.. మరెన్నో అంచనాలతో సార్వత్రిక ఎన్నికల ముందు యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మధ్యంతర బడ్జెట్ 2024-25 మరికొద్ది సేపట్లో పార్లమెంట్ ముందుకు రాబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మోదీ 2.0 ప్రభుత్వ చివరి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. ప్రస్తుత లోక్‌సభకు ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో ఎలాంటి ప్రకటనలు వెలువడుతాయన్న ఉత్కంఠ సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    అయితే ఈ మధ్యంతర బడ్జెట్‌లో కావడంతో పెద్దగా విధానపరమైన ప్రకటనలు ఉండకపోవచ్చే విశ్లేషణలు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్నికలపరంగా ముఖ్యమైన రైతులు, మహిళలకు సంబంధించిన ప్రకటనలు ఉండవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కాగా, నిర్మల ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ నెలకొల్పిన రికార్డును సమం చేయనున్నారు. 2019 జూలై నుంచి ఐదుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. గురువారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌తో ఆమె వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన గత ఆర్థిక మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌ సిన్హాల రికార్డులను అధిగమించనున్నారు. మొరార్జీ దేశాయ్‌ 1959-1964 మధ్య ఆర్థిక మంత్రిగా ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తంగా ఆయన పది బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు.