Share News

Budget 2024: పేదలు, మహిళలు, యువత అభ్యున్నతే మా లక్ష్యం: నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:34 AM

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆర్థిక మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించిందని చెప్పారు.

Budget 2024: పేదలు, మహిళలు, యువత అభ్యున్నతే మా లక్ష్యం: నిర్మలా సీతారామన్
Budget 2024

Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన సీతారామన్.. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. 2014కు ముందు దేశం అనేక సవాళ్లను ఎదుర్కొందన్న ఆర్థిక మంత్రి.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. కరోనా సంక్షోభాన్ని దేశం అధిగమించిందని చెప్పారు. పాలనలో పారదర్శకత తీసుకువచ్చామన్నారు. చిన్న బడ్జెట్‌పై భారీగా అంచనాలు ఉన్నాయని, అన్నివర్గాల ప్రజల సంక్షేమమే బడ్జెట్ లక్ష్యం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారని అన్నారు.

పదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి ఎంతో కృషిచేశామని చెప్పారు నిర్మలా సీతారామన్. పదేళ్లలో దేశ ఆర్థికస్థితి ఉన్నతస్థాయికి చేరుకుందన్నారు. పేదల అభివృద్ధే దేశ అభివృద్ధి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని, సబ్ కా సాత్, సబ్ కా వికాస్ లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం సమ్మీళిత వృద్ధి ఆలోచనా విధానం గ్రామ స్థాయికి చేరి సక్సెస్ అయ్యిందన్నారు. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోందని చెప్పారు. గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదదంగా ఉండేదని, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది పనితీరుగా మారిందన్నారు.

మహిళలు, యువత, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలే లక్ష్యంగా..

పేద మహిళ, యువత, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకొచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పేదరికం నుంచి పదేళ్లలో 25 కోట్ల మందికి విముక్తి కల్పించామన్నారు. జన్‌ధన్ అకౌంట్ల ద్వారా రూ. 34 లక్షల కోట్లు అందించామన్నారు.అన్నదాతల సంక్షేమం కోసం 11.8 కోట్ల మందికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. 2014లో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందన్నారు. సంస్కరణల పథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

Updated Date - Feb 01 , 2024 | 11:41 AM