Share News

Budget Session: పార్లమెంట్ ఉభల సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర ప్రసంగం ఇదే..

ABN , Publish Date - Jan 31 , 2024 | 12:03 PM

మధ్యంతర బడ్జెట్-2024-25ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతన పార్లమెంట్ భవనంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె మాట్లాడారు.

Budget Session: పార్లమెంట్ ఉభల సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర ప్రసంగం ఇదే..

న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్-2024-25ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నూతన పార్లమెంట్ భవనంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం సభా కార్యకలాపాలను సజావు నిర్వహించేందకు సహకరించాలని విపక్ష పార్టీలను రాష్ట్రపతి ముర్ము కోరారు. గతేడాది దేశం ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం శతాబ్దాలుగా దేశ ప్రజలు ఎంతో ఎదురుచూశారని, ఆ కల నేడు నిజమైందని ఆమె వ్యాఖ్యానించారు.


  • నూతన పార్లమెంటు భవనంలో ఇదే నా మొదటి ప్రసంగం. ‘అమృత్ కాల్’ ఆరంభంలో ఈ మహత్తర భవనాన్ని నిర్మించారు. 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్' సంకల్పాలను ఈ భవనం కలిగివుంది. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ సంప్రదాయాలను ఈ నూతన పార్లమెంట్ భవనం గౌరవిస్తోంది.

  • 21వ శతాబ్ధంలో నూతన భారతం సరికొత్త సంప్రదాయాలను నిర్మించాలనే సంకల్పానికి ఈ భవనం ప్రతీకగా ఉంది. ఈ నూతన పార్లమెంట్ భవనంలో విధవిధానాలపై అర్థవంతమైన చర్చలు జరుగుతాయని నేను విశ్వసిస్తున్నాను.

  • నిరుడు భారత్ అనేక విజయాలు సాధించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందింది. చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా ఇండియా అవతరించింది.

  • ఆసియా క్రీడల్లో భారత్ 100కు పైగా పతకాలను గెలుచుకుంది. ‘అటల్ సొరంగం’ అందుబాటులోకి వచ్చింది.

  • దేశ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఎన్నో పనులను పూర్తయ్యాయి.

  • దేశ యువ శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదలు అనే నాలుగు బలమైన స్తంభాలపై దేశం నిలబడుతుందని నా ప్రభుత్వం ప్రగాఢ విశ్వాసంతో ఉంది.

  • గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో రెండు ప్రధాన యుద్ధాలు, కరోనా వంటి మహమ్మారిని దేశం ఎదుర్కొంది. ఇలాంటి ప్రపంచ సంక్షోభాలను చవిచూసినప్పటికీ దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం పెరగనివ్వకుండా చూసుకుంది.


  • జమ్ము కాశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు ఇప్పుడు చరిత్రగా మారిపోయింది.

  • 'మేకిన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' దేశానికి బలాలుగా రూపాంతరం చెందాయి.

  • నేడు దేశం సాధించిన విజయాలు గత పదేళ్లలో చేపట్టిన పనులకు కొనసాగింపు.

  • చిన్నప్పటి నుంచి ‘గరీబీ హఠావో’ నినాదాన్ని వింటున్నాం. కానీ మొదటిసారిగా పేదరిక నిర్మూలన విస్తృతస్థాయిలో కొనసాగుతోంది.

Updated Date - Jan 31 , 2024 | 12:27 PM