Home » Trending Videos
చలిని తట్టుకునేందుకు ఓ వ్యక్తి ధరించిన జాకెట్ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. సాధారణానికి భిన్నంగా ఈ జాకెట్‌ను రూపొందించారు. నాలుగు జాకెట్లను కలిపి ఓకే జాకెట్లా జాయింట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు..
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట పరిధిలో చోటు చేసుకున్న పేలుడు ఘటనకు సంబంధించి కీలక అప్డేట్స్ వెలుగులోకి వస్తున్నాయి. పేలుడు ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు బయటికి రావడంతో వైరల్ అవుతున్నాయి. సమారు 3 గంటల పాటు కారును అక్కడే పార్క్ చేశారని, నిందితులు కూడా అందులోనే కూర్చున్నట్లు చెబుతున్నారు.
బడికి వెళ్లే సమయంలో పిల్లలు మారాం చేయడం సర్వసాధారణం. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలను బలవంతంగా స్కూల్‌కు తీసుకెళ్తుంటారు. ఇంకొందరు బతిమాలో, బుజ్జగించో పంపిస్తుంటారు. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది..
రష్యాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
దాహం వేయడంతో ఓ సింహం.. నీళ్లు తాగేందుకు ఓ నది వద్దకు వెళ్లింది. నది లోపలికి దిగిన సింహం దాహం తీర్చుకుంటుంది. అయితే అప్పటికే ఓ మొసలి నీటిలో నక్కి, వేట కోసం ఎదురుచూస్తోంది. దాహం తీర్చుకున్న సింహం.. నది దాటేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ కోతి రాయిపై కూర్చుని పర్యాటకులు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ఓ పర్యాటకుడు అక్కడి వచ్చాడు. పాడైన గుడ్డును కోతికి అందించాడు. గుడ్డును చూసిన కోతి.. వెంటనే దాన్ని తీసుకుంటుంది. గుడ్డుపై బొప్పిని ఎంతో ఓపిగ్గా ఒలిచి తీసేసింది. అయితే తీరా తినబోయే ముందు ఏమవుతుందో మీరే చూడండి..
రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. అయితే అందులో ఓ ఫార్చునర్ కారు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతగా అందులో ఏం స్పెషాలిటీ ఉందని అనుకుంటున్నారా.. స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు గానీ.. కారు సైడ్ మిర్రర్ స్థానంలో అతను చేసిన చిన్న మార్పే ఇందుకు కారణం. సాధారణంగా..
భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఓ మహిళకు వేలిలో ముల్లు గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు ఆమె తెగ తంటాలు పడింది. అయినా ముల్లు మాత్రం బయటికి రాలేదు. ఈ క్రమంలో ఓ మహిళ తన బుర్రకు పదును పెట్టింది. ముల్లు తీసే పద్ధతి అది కాదంటూ.. తన ట్రిక్‌ను బయటపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..
ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ప్రమాదం నుంచి అతను బయటపడడంతో వింతేమీ లేకున్నా..