Home » Tirupathi News
తిరుపతిలోని నటుడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు రూపేణా రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయంపై విచారణ జరిపింది ఉన్నత విద్యా కమిషన్.
తిరుపతిలో రౌడీ కల్చర్ కోరలు చాచింది. ఓ రౌడీ మద్యం మత్తులో కత్తితో వీరంగం చేస్తూ నడిరోడ్డుపై సోమవారం జనాలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇతడితోపాటు ప్రత్యర్థినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వీధిలో నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితోపాటు పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్‌పై కిరణ్ రాయల్ కేసు బాధితురాలు పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వారిపై పిర్యాదు చేసింది.
దూకేస్తా.. ఆత్మహత్య చేసుకుంటా.. అంటూ విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన కర్ణాటక యువకుడి ఉదంతం విషాదంగా మారింది.
కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న జి.యుగంధర్ మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బంగారు పతకం అందుకున్నాడు.
ఏడుకొండల మీద అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్న గరుడోత్సవం ప్రతి సంవత్సరం భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేస్తోంది.
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి గరుడ సేవను తిలకించడానికి ఇప్పటికే లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మాడ వీధుల్లోని గ్యాలరీలు ఇప్పటికే దాదాపుగా నిండిపోయాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన తమన్నగారి సతీష్‌కుమార్ (23) తిరుపతిలో హత్యకు గురయ్యారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైలు పట్టాల పక్కన ఈ ఘాతుకం జరిగింది. తిరుపతి రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. ఆర్గొండ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ ఒక్కడే కుమారుడు.
జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను సస్పెండ్ చేస్తూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల కొండపై శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. భక్తుల భద్రత విషయంలో పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో నింగి నుంచీ నిఘా పెట్టనుంది.